మాజీ మంత్రి నారాయణకు నోటీసులు

అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు (ఐఆర్‌ఆర్‌) కేసులో విచారణకు హాజరు కావాలంటూ తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి పి.నారాయణకు సీఐడీ అధికారులు నోటీసులిచ్చారు.

Updated : 03 Oct 2023 06:33 IST

రేపు విచారణకు హాజరు కావాలని నిర్దేశం

ఈనాడు, అమరావతి: అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు (ఐఆర్‌ఆర్‌) కేసులో విచారణకు హాజరు కావాలంటూ తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి పి.నారాయణకు సీఐడీ అధికారులు నోటీసులిచ్చారు. ఈ నెల 4న (బుధవారం) ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని సీఐడీ ఆర్థిక నేరాల విభాగం-2 కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని వాట్సప్‌లో పంపిన నోటీసుల్లో పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రమే వాట్సప్‌లో నోటీసులు రాగా నారాయణ సోమవారం ఈ మేరకు ధ్రువీకరించారు. విచారణకు హాజరు కాకపోయినా, నోటీసుల్లో పేర్కొన్న నిబంధనలకు కట్టుబడకపోయినా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో హెచ్చరించారు. ఇదే కేసులో తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌కు కూడా సీఐడీ అధికారులు సీఆర్‌పీసీ 41ఏ నోటీసులు జారీ చేసి, బుధవారం ఉదయమే విచారణకు హాజరు కావాలని చెప్పిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు