Chandrababu: ‘ఐటీని తెలుగువారికి పరిచయం చేయడమే చంద్రబాబు నేరమా?’

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఐటీని పరిచయం చేసి తెలుగువారు ఆ రంగంలో స్థిరపడి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఉన్నతంగా జీవించడానికి తెదేపా అధినేత చంద్రబాబు చేసిన కృషే కారణమని ఐటీ ఉద్యోగిని ప్రతిభ అన్నారు.

Updated : 03 Oct 2023 08:54 IST

విదేశాల్లో ఉన్నతంగా జీవించడానికి ఆయన దార్శనికతే కారణం
జర్మనీలో స్థిరపడ్డ ఐటీ ఉద్యోగిని ప్రతిభ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఐటీని పరిచయం చేసి తెలుగువారు ఆ రంగంలో స్థిరపడి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఉన్నతంగా జీవించడానికి తెదేపా అధినేత చంద్రబాబు చేసిన కృషే కారణమని ఐటీ ఉద్యోగిని ప్రతిభ అన్నారు. జర్మనీ రాజధాని బెర్లిన్‌లో 8 ఏళ్లుగా నివసిస్తున్న ఆమె.. జర్మన్‌ సెంట్రల్‌లో చంద్రబాబుకు మద్దతుగా నిరసన తెలిపారు. మధ్యయుగాల్లో జర్మనీలో చెలరేగిన మతోన్మాదానికి వ్యతిరేకంగా మార్టిన్‌లూథర్‌ అనే క్రైస్తవ సన్యాసి ప్రారంభించిన ఉద్యమానికి కేంద్ర స్థానమైన జర్మన్‌ సెంట్రల్‌ను..చంద్రబాబు అక్రమ అరెస్టుపై ఎలుగెత్తడానికి సరైన ప్రాంతంగా భావిస్తున్నట్టు ఓ వీడియో ప్రకటనలో ఆమె వెల్లడించారు. ‘‘చంద్రబాబు ఓ దార్శనికుడు. యువత జీవితాల్లో మార్పు తీసుకురావాలని ఆయన నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టును ప్రారంభిస్తే...జగన్‌ ప్రభుత్వం తప్పుడు ఆరోపణలతో అన్యాయంగా అరెస్టు చేసింది. రాజకీయాలకు అతీతంగా ఈ చర్య మమ్మల్ని బాధిస్తోంది. ‘వీ ఆర్‌ విత్‌ సీబీఎన్‌’, ‘అవర్‌ ఫ్యూచర్‌ టీడీపీ’ పేరుతో విదేశాల్లో కార్యక్రమాలు చేస్తున్నాం. మా వంతుగా వైకాపా ప్రభుత్వ అరాచకాలపై నిరసన తెలుపుతున్నాం. అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్‌.. ప్రజావేదికను కూల్చారు. డా.సుధాకర్‌ను హత్య చేయించారు. వైకాపా వాళ్లు నోరు తెరిస్తే బూతులే వస్తున్నాయి. చంద్రబాబు త్వరగా జైలు నుంచి బయటకు రావాలి. రాష్ట్రానికి పూర్వవైభవం తేవాలి. నారా భువనేశ్వరి, లోకేశ్‌, బ్రాహ్మణిలకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం’’ అని ప్రతిభ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని