బాబు అరెస్టుతో మనోవేదనకు గురై మరో నలుగురి మృతి

తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మనోవేదనకు గురై మరో నలుగురు మృతి చెందారు. చంద్రబాబును నిర్బంధించారని మనస్తాపానికి గురై విశాఖ నగరం గాజువాక భానోజీతోటకు చెందిన ఉప్పలపాటి సరోజిని(58) ఆదివారం రాత్రి మృతి చెందారని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.

Updated : 03 Oct 2023 04:50 IST

న్యూస్‌టుడే బృందం: తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మనోవేదనకు గురై మరో నలుగురు మృతి చెందారు. చంద్రబాబును నిర్బంధించారని మనస్తాపానికి గురై విశాఖ నగరం గాజువాక భానోజీతోటకు చెందిన ఉప్పలపాటి సరోజిని(58) ఆదివారం రాత్రి మృతి చెందారని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఇదే కోవలో ఏలూరు జిల్లా చాట్రాయి మండలం కోటపాడు గ్రామ తెదేపా ప్రధాన కార్యదర్శి వేముల రామారావు(53) సోమవారం, అనకాపల్లి జిల్లా మునగపాక మండలం తోటాడ శివారు గవర్ల అనకాపల్లికి చెందిన తెదేపా సీనియర్‌ కార్యకర్త మత్తుర్తి వెంకటరావు (53) ఆదివారం రాత్రి, కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం వల్లూరుపాలెం గ్రామానికి చెందిన దేవినేని శకుంతల(82) ఆదివారం మృతిచెందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని