సీబీఎస్‌ఈ పాఠశాల పరీక్షల విధానంలో మార్పు

రాష్ట్రంలో సీబీఎస్‌ఈ గుర్తింపు ఉన్న వెయ్యి ప్రభుత్వ పాఠశాలల్లో 8, 9వ తరగతులకు పరీక్షల విధానంలో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Published : 03 Oct 2023 03:32 IST

పదోతరగతిలో  ఆరో సబ్జెక్టుగా స్కిల్‌ పరీక్ష

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో సీబీఎస్‌ఈ గుర్తింపు ఉన్న వెయ్యి ప్రభుత్వ పాఠశాలల్లో 8, 9వ తరగతులకు పరీక్షల విధానంలో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు ఫార్మెటివ్‌, సమ్మెటివ్‌ పరీక్షలుండగా వాటిని పీరియాడిక్‌, టర్మ్‌ పరీక్షలుగా మార్చింది. పీరియాడిక్‌ రాత పరీక్ష (పీడబ్ల్యూటీ)-2 ఆరో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు నిర్వహించనున్నారు. పీడబ్ల్యూటీలు మొత్తం నాలుగు ఉంటాయి. టర్మ్‌ పరీక్షలు రెండు ఉంటాయి. టర్మ్‌-1 నవంబరులో, టర్మ్‌-2 పరీక్షలను మార్చిలో నిర్వహిస్తారు. టర్మ్‌ పరీక్షలో 80 మార్కులకు రాత, 20 మార్కులకు అంతర్గత పరీక్షలుంటాయి. పీడబ్ల్యూటీలో 40 మార్కులకు రాత, 10 మార్కులకు అంతర్గత పరీక్షలుంటాయి. విద్యార్థులు ప్రతి సబ్జెక్టులోనూ 33 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. పదో తరగతిలో అయిదు సబ్జెక్టులు మాత్రమే ఉంటాయి. మొదటి భాషగా ఆంగ్లం, రెండో భాషగా తెలుగు ఉంటుంది. మూడో భాష హిందీ ఉండదు. ఆరో సబ్జెక్టుగా స్కిల్‌ సబ్జెక్టును అమలు చేయనుండగా 50 మార్కులు థియరీ, 50 మార్కులు ప్రాక్టికల్స్‌ ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని