మా కుటుంబం ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతించండి
‘వైకాపా వాళ్లు నా రూ.16 కోట్ల విలువైన ఆస్తి మోసం చేసి దోచుకున్నారు. జగనన్నా మీకు చిత్తశుద్ధి ఉంటే దొంగలను పట్టుకోండి. న్యాయం చేయ లేకపోతే మేం ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతించండి. నన్ను మోసం చేసిన వ్యక్తి ఇతనే..
రూ.16 కోట్లు మోసం చేసిన వ్యక్తికి మీ ఎమ్మెల్యే అండగా నిలిచారు
మిమ్మల్ని కలిసేందుకు అనుమతి రావడం లేదు
సీఎంను ఉద్దేశించి కారుపై లేఖలు అంటించిన బాధితుడు
వైకాపా కేంద్ర కార్యాలయం వద్ద ఆ వాహనం వదిలేసి నిరసన
ఈనాడు, అమరావతి: ‘వైకాపా వాళ్లు నా రూ.16 కోట్ల విలువైన ఆస్తి మోసం చేసి దోచుకున్నారు. జగనన్నా మీకు చిత్తశుద్ధి ఉంటే దొంగలను పట్టుకోండి. న్యాయం చేయ లేకపోతే మేం ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతించండి. నన్ను మోసం చేసిన వ్యక్తి ఇతనే.. మీ పార్టీ ఎమ్మెల్యే గంగుల నానితో మీతో ఆ వ్యక్తి దిగిన ఫొటోలివిగో..’ అంటూ వీటన్నింటినీ ఒక కారుపై అతికించి, తన మొబైల్ నంబరును కూడా వేసి ఆ కారును సోమవారం వైకాపా కేంద్ర కార్యాలయం వద్ద బాధితుడు సిద్ధంరెడ్డి రమణారెడ్డి అనే వ్యక్తి వదిలేసి వెళ్లారు. నాలుగేళ్లుగా న్యాయం కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో ఈ పని చేశానని ఆయన పేర్కొన్నారు. జిల్లా స్పందనలో 33 సార్లు ఫిర్యాదు చేశానని, ముఖ్యమంత్రిని కలిసి విన్నవించుకుందామంటే అనుమతి రాలేదని వాపోయారు. తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకొనేందుకు అనుమతినివ్వండి అంటూ చేతిలో మైకు పట్టకుని సీఎం క్యాంపు కార్యాలయం పరిసర ప్రాంతాల్లో ముఖ్యమంత్రికి వినిపించేలా గట్టిగా విజ్ఞప్తి చేశారు. తాను తీసుకున్న సెల్ఫీ వీడియోనూ చూపించారు. కారును వదిలేసి విజయవాడకు చేరుకున్న బాధితుణ్ని మీడియా ప్రతినిధులు కలిసి వాకబు చేయగా తనకు జరిగిన నష్టాన్ని వివరించారు.
రూ.16 కోట్ల ఆస్తిని దౌర్జన్యంగా తీసుకున్నారు
రమణా రెడ్డి చెప్పిన వివరాలు ఆయన మాటల్లో.. ‘మాది నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం పెద్దచింతకుంట. మా బావ వైకాపా నేత బాలిరెడ్డి, మరో నలుగురితో కలిసి 27 ఏళ్లుగా మా నాన్న రసాయనాలు, పురుగుల మందుల వ్యాపారం చేశారు. లాభాలతో నంద్యాల, చుట్టుపక్కల ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేశారు. వాటిలో నాకు రావాల్సిన రూ.16 కోట్ల ఆస్తిని బాలిరెడ్డి కొడుకు మల్లికార్జున రెడ్డి, ఆయన సోదరులు దౌర్జన్యంగా స్వాధీనం చేసుకున్నారు. మల్లికార్జున రెడ్డి ఆళ్లగడ్డ వైకాపా ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్(నాని) రెడ్డి అనుచరుడు. ఎవరికి చెప్పుకొంటావో చెప్పుకో అని బెదిరిస్తున్నారు. నాలుగేళ్ల నుంచి తిరుగుతున్నా నాకు న్యాయం జరగలేదు. ఎమ్మెల్యేని కలిసి అడిగితే నన్ను మోసం చేసినవారి తరఫునే ఆయన మాట్లాడారు. కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల్లో జరిగిన స్పందనలో ఫిర్యాదు చేసినా స్పందన లేదు. వైకాపా నేతలు నన్ను, నా కుటుంబాన్ని వేధిస్తున్నారు. ముఖ్యమంత్రి అయినా కల్పించుకుని ఇప్పటికైనా న్యాయం చేయాలని కోరుతున్నా. లేదంటే మా కుటుంబం ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతినివ్వాలని సీఎంను కోరుతున్నా.’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఎవడ్రా నువ్వు.. తమాషాలు చేస్తున్నావా’.. ఎంపీడీవోపై ముత్తంశెట్టి చిందులు
గెజిటెడ్ అధికారి అయిన ఓ ఎంపీడీవోపై మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు బహిరంగ వేదికపై దుర్భాషలాడారు. -
Hyderabad: కుమార్తెకు సొంత వైద్యం.. ప్రాణం మీదకు తెచ్చిన తండ్రి
ఏ చిన్న అనారోగ్యం వచ్చినా.. చాలామంది సొంతంగా మందులు కొని వేసుకుంటారు. కొందరైతే గూగుల్‌లో వెతికి ఆ మందులు వాడేస్తుంటారు. -
AP News: అమరావతి బాండ్‌కు అథోగతి
వైకాపా ప్రభుత్వ అస్తవ్యస్త ఆర్థిక నిర్వహణ వల్ల రాష్ట్రం పరువు మరోసారి గంగలో కలిసింది. అమరావతి బాండ్ల రేటింగ్‌ను ఇటీవల క్రిసిల్, తాజాగా అక్యూట్ సంస్థలు తగ్గించడాన్నిబట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని జగన్ ప్రభుత్వం ఎంత అధ్వానస్థితిలోకి నెట్టేసిందో అర్థమవుతోంది. -
పర్యాటకాభివృద్ధి సంస్థ కార్యాలయంలో మంటలు
హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లో ఉన్న తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (టీఎస్‌టీడీసీ) కార్యాలయంలో శుక్రవారం తెల్లవారుజామున మంటలు చెలరేగడంతో దస్త్రాలన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. -
CM Jagan: జగనేందిరో... రోడ్డు వేసుడేందిరో
వారంతా కనీస సౌకర్యాల్లేని అభాగ్యులు... కొండకోనల్ని నమ్ముకున్న గిరిజనులు.. పెద్దగా డిమాండ్లు లేని అల్ప సంతోషులు... భారీగా ఏమీ అడగరు... ఇవ్వలేదని ఆందోళనా చేయరు... కానీ... వారంతా ముక్తకంఠంతో కోరుకునేది ఒక్కటే... చిన్న బాట! పండించిన తమ పంటలు, అటవీ ఉత్పత్తులను అమ్ముకోవటానికి... అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులకు వెళ్లటానికి... దారి కావాలని కోరుకున్నారు! -
సభలకు వస్తారా.. చస్తారా!
డ్వాక్రా సంఘాల మహిళలను అధికార వైకాపా రాజకీయ సభలకు తరలివచ్చే ముడిసరకుగా మార్చేశారు. ఊరూ, మండలం, జిల్లా, రాష్ట్రం... ఏ స్థాయిలో సభలూ సమావేశాలు నిర్వహించినా వాటికి భారీగా చేపట్టే జన సమీకరణంతా ఈ డ్వాక్రా మహిళలే! -
Palnadu: రెండిళ్ల గొడవ.. రోడ్డెక్కింది గోడై!
పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం కారుమంచి గ్రామంలో ఓ ఇంటి యజమాని ఎదురింటి వారితో గొడవపడి నడిరోడ్డుపై గోడ నిర్మించారు. గ్రామానికి చెందిన కిలారు లక్ష్మీనారాయణ, కిలారు చంద్రశేఖర్‌కు చెందిన ఇళ్లు ఎదురెదురుగా ఉంటాయి. -
నంద్యాల జిల్లాలో వందశాతం పిల్లల బడిబాట
నూటికి నూరు శాతం పిల్లలు బడిలో చదువుకుంటున్న దేశంలోని తొలి జిల్లాగా నంద్యాల రికార్డు సృష్టించిందని ప్రభుత్వం ప్రకటించింది. విద్యాశాఖపై క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సీఎం జగన్ నిర్వహించిన సమీక్షలో ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు
ప్రభుత్వ పాఠశాలల తల్లిదండ్రుల కమిటీల పదవీకాలాన్ని 2024 జూన్/జులై వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
తితిదేకు రూ.5 కోట్ల విద్యుత్ గాలిమర విరాళం
ముంబయికి చెందిన విష్ విండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ తితిదేకు రూ.5 కోట్ల విలువైన గాలిమరను విరాళంగా అందించింది. తిరుమల జీఎన్సీ ప్రాంతంలో ఈ గాలిమర ఏర్పాట్లను శుక్రవారం ఉదయం తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి, ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. -
డిస్కంల ఆర్థిక లోటు రూ.13,878 కోట్లు
రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు తమ ఆర్థికలోటును రూ.13,878.11 కోట్లుగా అంచనా వేస్తున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సర వార్షిక ఆదాయ అవసరాల నివేదిక(ఏఆర్ఆర్)లో ఈ లెక్కలు చూపాయి. -
రాజ్‌భవన్‌లో నాగాలాండ్ ఆవిర్భావ వేడుకలు
నాగాలాండ్ ఆవిర్భావ వేడుకలను శుక్రవారం విజయవాడలోని ఏపీ రాజ్‌భవన్‌లో నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. -
అటవీ సబార్డినేట్ సర్వీసుల శిక్షణ నియమావళి సవరణ
అటవీ సబార్డినేట్ సర్వీసుల శిక్షణ నియమావళిని రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. రాజమహేంద్రవరంలోని రాష్ట్ర అటవీ అకాడెమీలో శిక్షణ పొందేవారికి ఈ నియమావళి వర్తిస్తుంది. -
గ్రంథాలయ సంస్థల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా మధుసూదన్‌రాజు
జిల్లా గ్రంథాలయ సంస్థల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా కళ్లేపల్లి మధుసూదన్‌రాజు, కమ్మన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
న్యాయాధికారులకు కరవు భత్యం పెంపు
ఆంధ్రప్రదేశ్‌లోని 2022లో జ్యుడిషియల్ పే కమిషన్ సిఫార్సుల ప్రకారం పే స్కేళ్లు సవరించిన న్యాయాధికారులకు కరవు భత్యాన్ని 38 నుంచి 42 శాతానికి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. -
ఇంటర్ రీజియన్ బదిలీలు చేయాలి
రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పడక ముందు ఉన్న ఆర్టీసీ రీజియన్ల పరిధిలో వివిధ కేటగిరీల్లో నియామకమైన సిబ్బంది.. కుటుంబ, వైద్యపరమైన అవసరాల కోసం డిప్యుటేషన్‌పై ఇతర రీజియన్లలో పనిచేస్తున్నారని, వారిని అక్కడికి బదిలీ చేసేలా వీలుకల్పించాలని ఎంప్లాయిస్ యూనియన్ కోరింది. -
‘వైఎస్సార్ ప్రతిమ జ్ఞాపిక’కు నామినేషన్ల ఆహ్వానం
సమష్టికృషితో పనిచేసిన నాటక పరిషత్తులకు ప్రభుత్వం.. ఈ ఏడాది నుంచి డా.వైఎస్సార్ రంగస్థల పురస్కారం ఇవ్వనుంది. నాటక సమాజాల ప్రోత్సాహకానికి ఏటా ఒక అవార్డును ప్రకటిస్తామని ఏపీ చలనచిత్ర, నాటకరంగ -
బీచ్‌శాండ్ మైనింగ్ టెండర్ ప్రక్రియ నిలిపేయాలి
బీచ్ శాండ్ మినరల్ మైనింగ్ ప్రాజెక్టును ప్రైవేటు సంస్థలకిచ్చే టెండర్ ప్రక్రియను నిలిపివేయాలని కోరుతూ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ శుక్రవారం లేఖ రాశారు. -
ఇదీ సంగతి!
-
జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ల గౌరవవేతనం పెంపు
జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ల గౌరవ వేతనాలను పెంచుతూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వారికి ఇప్పటివరకు నెలకు రూ.2,500 చెల్లిస్తుండగా.. ఇప్పుడు రూ.30వేలకు పెంచారు. -
ఓటర్ల ముసాయిదా జాబితా లోపభూయిష్టం
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో 806 ఇళ్లలో 10 మంది కన్నా ఎక్కువ ఓటర్లు ఉన్నట్లు నమోదు చేశారు.


తాజా వార్తలు (Latest News)
-
Chess: ఒకే ఇంటి నుంచి ఇద్దరు గ్రాండ్ మాస్టర్లు.. ప్రజ్ఞానంద-వైశాలి అరుదైన ఘనత
-
Mike Tyson: ‘ఆ పంచ్ దెబ్బలకు రూ.3 కోట్లు ఇవ్వండి’.. మైక్ టైసన్‌ను డిమాండ్ చేసిన బాధితుడు
-
Rohit - Hardik: రోహిత్-హార్దిక్ విషయంలో సెలక్టర్లకు కఠిన సవాల్ తప్పదు: నెహ్రా
-
Honda Recall: హోండా మోటార్ సైకిళ్ల రీకాల్.. కారణం ఇదే!
-
Silk Smitha: సిల్క్ స్మిత బయోపిక్.. హీరోయిన్గా ఎవరంటే..?
-
Nagarjuna Sagar: సాగర్ వ్యవహారం.. తెలుగు రాష్ట్రాల మధ్య పోటాపోటీ కేసులు