నాన్న జ్ఞాపకాలతో నా హృదయం నిండిపోయింది

తండ్రి ఎన్టీఆర్‌ జ్ఞాపకాలతో తన హృదయం నిండిపోయిందని తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి భావోద్వేగానికి గురయ్యారు. తెలుగుజాతి కోసం ఎన్టీఆర్‌ తన జీవితాన్ని అంకితం చేశారని గుర్తుచేసుకున్నారు.

Updated : 03 Oct 2023 06:43 IST

నారా భువనేశ్వరి భావోద్వేగం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తండ్రి ఎన్టీఆర్‌ జ్ఞాపకాలతో తన హృదయం నిండిపోయిందని తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి భావోద్వేగానికి గురయ్యారు. తెలుగుజాతి కోసం ఎన్టీఆర్‌ తన జీవితాన్ని అంకితం చేశారని గుర్తుచేసుకున్నారు. ‘‘సత్యం ఎంత కఠినంగా ఉన్నా ఆచరించాలని, కట్టుబడి ఉండాలని ఆయన ఎప్పుడూ మాకు బోధించేవారు. న్యాయం కోసం ఎన్టీఆర్‌ చేసిన పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకం. తెలుగు వారికి సేవ చేయటంలో ఆయన చూపిన అంకితభావం.. ప్రజలతో పాటు ఎన్టీఆర్‌ సంతానంగా మాకు ఆదర్శం’’ అని సోమవారం ట్విటర్‌ వేదికగా కీర్తించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు