చంద్రబాబుకు ప్రవాసాంధ్రుల బాసట

చంద్రబాబు అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ వివిధ దేశాల్లో ప్రవాసాంధ్రులు నిరసన ప్రదర్శనలతో హోరెత్తిస్తున్నారు. సోమవారం కూడా పలు దేశాల్లో ఆందోళనలు చేశారు. లండన్‌ పార్లమెంటు వద్ద ఉన్న గాంధీ విగ్రహం ఎదుట తెలుగు ప్రజలు నిరసన తెలిపారు.

Updated : 03 Oct 2023 06:45 IST

ఈనాడు, అమరావతి: చంద్రబాబు అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ వివిధ దేశాల్లో ప్రవాసాంధ్రులు నిరసన ప్రదర్శనలతో హోరెత్తిస్తున్నారు. సోమవారం కూడా పలు దేశాల్లో ఆందోళనలు చేశారు. లండన్‌ పార్లమెంటు వద్ద ఉన్న గాంధీ విగ్రహం ఎదుట తెలుగు ప్రజలు నిరసన తెలిపారు. ‘సత్యమేవ జయతే’ పేరుతో నిరసన దీక్ష చేశారు. వారిని యూకేలోని భారత హైకమిషనర్‌ దొరైస్వామి, స్థానిక భారత సంతతి ఎంపీ వీరేంద్రశర్మ కలిసి సంఘీభావం ప్రకటించారు. మిన్నియాపోలిస్‌, మిన్నెసోటాలో ఎన్‌ఆర్‌ఐ తెదేపా, ఎన్‌ఆర్‌ఐ జనసేన ఆధ్వర్యంలో నిరసనలు చేశారు. చంద్రబాబుకు మద్దతుగా బాలబాలికలు ప్లకార్డులు ప్రదర్శించారు. వాషింగ్టన్‌ డీసీలో మహిళలు నలుపు, పసుపు రంగుల దుస్తులు ధరించి నిరసన వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫిలడెల్ఫియాలో మహిళలు కొవ్వొత్తులు చేతపట్టి  నిరసన ప్రదర్శన చేశారు. డెట్రాయిట్‌లో ర్యాలీ నిర్వహించగా, పెద్ద సంఖ్యలో యువతులు పాల్గొన్నారు. బ్రిస్టల్‌ తెలుగు అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ప్రవాసాంధ్రులు నిరసన ప్రదర్శన జరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని