రైల్వేజోన్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వమే అడ్డంకి
రాష్ట్రంలో రైల్వేజోన్ ఏర్పాటుపై ఎట్టకేలకు కేంద్రం కదిలింది. చాలాకాలం తర్వాత కార్యాలయాల నిర్మాణానికి సిద్ధమైంది. అయితే హామీ కార్యరూపం దాల్చడానికి రాష్ట్రప్రభుత్వమే అడ్డంకిగా నిలుస్తోంది.
భూములు అప్పగించకుండా మొద్దునిద్ర
జోన్ ప్రకటన తర్వాతైనా అప్పగించని వైనం
అధికార పార్టీ కీలక నేత భూముల్లోంచి దారి ఇవ్వలేకపోవడమే కారణమా?
ఈనాడు - అమరావతి, విశాఖపట్నం: రాష్ట్రంలో రైల్వేజోన్ ఏర్పాటుపై ఎట్టకేలకు కేంద్రం కదిలింది. చాలాకాలం తర్వాత కార్యాలయాల నిర్మాణానికి సిద్ధమైంది. అయితే హామీ కార్యరూపం దాల్చడానికి రాష్ట్రప్రభుత్వమే అడ్డంకిగా నిలుస్తోంది. మా భూములు అప్పగించండి మహాప్రభో అంటూ రైల్వే అధికారులు ఎన్నిసార్లు కోరినా.. వైకాపా సర్కారు పట్టించుకోకుండా తీవ్రజాప్యం చేస్తోంది. గతంలో తీసుకున్న రైల్వే భూములకు ప్రత్యామ్నాయంగా ఇస్తామన్న భూములు ఇవ్వాలని రైల్వేశాఖ కోరుతున్నా.. ప్రభుత్వం తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. అధికారపార్టీ కీలక నేత భూముల్లోంచి దారి ఇవ్వాలనే భూములు అప్పగించకుండా జాప్యం చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది.
విశాఖపట్నం కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటు రాష్ట్రప్రజల చిరకాల కోరిక. దక్షిణకోస్తా జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు 2019 ఫిబ్రవరిలో కేంద్రం ప్రకటించింది. జోనల్ కార్యాలయాలు, ఇతర భవనాలకు 2020-21 కేంద్ర బడ్జెట్లో రూ.170 కోట్లు కేటాయించారు. ఇప్పటివరకు ఒక్క ఇటుక కూడా పేర్చలేదు. తొలుత విశాఖపట్నం రైల్వేస్టేషన్ సమీపంలోనే భవనాలు నిర్మిస్తామని, డీపీఆర్ సిద్ధమైందని, శంకుస్థాపన చేస్తామని చెప్పింది. తర్వాత ముడసర్లోవలో రైల్వేకి చెందాల్సిన 52 ఎకరాల్లో నిర్మాణాలు చేస్తామంది. దీంతో వ్యవహారం మొదటికొచ్చింది. వాస్తవానికి విశాఖలో బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (బీఆర్టీఎస్) రహదారి నిర్మాణానికి 2010-11లో రైల్వేకి చెందిన ప్రస్తుత డీఆర్ఎం కార్యాలయం, మర్రిపాలెం తదితర చోట్ల సుమారు 15 ఎకరాలను మహావిశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) తీసుకుంది. వీటికి బదులు ముడసర్లోవలో 52 ఎకరాలు ఇచ్చేందుకు అప్పట్లో ఒప్పందం చేసుకున్నారు. తర్వాత భూములను రైల్వేశాఖకు అప్పగించలేదు.
జోన్ ప్రకటనతో భూములకు ప్రాధాన్యం
కేంద్రం రైల్వేజోన్‌ను ప్రకటించాక ముడసర్లోవ భూములకు ప్రాధాన్యం వచ్చింది. అప్పట్లోనే ఆ భూములకు కంచె వేసేందుకు రైల్వే అధికారులు ప్రయత్నించగా.. అక్కడి రైతులు అడ్డుకుని ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. దీంతో రైల్వేశాఖ అక్కడ సర్వే చేయించగా.. 27 ఎకరాలు అందుబాటులో ఉందని, మిగిలినది ఆక్రమణలో ఉందని తేలింది. అప్పటినుంచి తమకు భూములను అప్పగించాలని జీవీఎంసీ అధికారులను రైల్వేశాఖ కోరుతూనే ఉంది.
విజ్ఞప్తులు పట్టించుకునేవారు ఏరీ?
రైల్వేజోన్ త్వరగా వచ్చేలా కృషిచేస్తున్నామని అధికారపార్టీ ఎంపీలు పదేపదే చెబుతున్నా.. భూములు అప్పగించే ప్రయత్నాలు చేయట్లేదు. ఒప్పందం ప్రకారం తమకు కేటాయించిన భూములు అప్పగించాలని జీవీఎంసీ అధికారులకు విశాఖ రైల్వే అధికారులు నాలుగుదఫాలు విజ్ఞప్తులు ఇచ్చారు. ఓసారి విశాఖ వచ్చిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి, రాష్ట్ర పురపాలకశాఖ మంత్రిగా బొత్స సత్యనారాయణ ఉన్నప్పుడు ఆయన దృష్టికీ ఈ అంశాన్ని రైల్వే అధికారులు తీసుకెళ్లారు. విశాఖ రైల్వే డివిజన్ గత డీఆర్ఎం రెండుసార్లు జిల్లా కలెక్టర్‌ను కలిసినా ఫలితం లేదు.
ఆ నేత భూముల్లో దారి ఇవ్వలేక?
గతంలో ఉత్తరాంధ్రలో హవా కొనసాగించిన ఓ అధికారపార్టీ కీలక నేతకు ముడసర్లోవలో భూములు ఉన్నట్లు తెలిసింది. రైల్వేకి కేటాయించిన భూములకు చేరుకోవాలంటే ఈ నేత భూముల్లోంచి దారి ఇవ్వాలని సమాచారం. అందుకే జీవీఎంసీ, రెవెన్యూ అధికారులు వాటి జోలికి వెళ్లేందుకు వెనకడుగు వేస్తున్నారని రైల్వేవర్గాల్లో చర్చ జరుగుతోంది. అక్కడ న్యాయపరమైన చిక్కులు ఉండటంతో ముందుకు వెళ్లట్లేదని జీవీఎంసీ ఎస్టేట్స్ విభాగం అధికారులు చెబుతున్నారు. చిక్కులు పరిష్కరించేందుకు చొరవ చూపకుండా, మరోచోటైనా భూములు ఇచ్చేలా చూడకుండా రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందనే విమర్శలు వస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబోస్‌కు గురజాడ విశిష్ట పురస్కారం
గురజాడ రచనల్లో వాడుక భాష ఎంతో గొప్పదని, అదే తనకు నచ్చిన అంశమని ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్ అన్నారు. -
‘ఎంఎస్ఎంఈ ఏపీ వన్’ పేరుతో కొత్త సర్వే
ఆర్భాటం.. ప్రచారం అనేది జగన్ ప్రభుత్వానికే సాధ్యమైన విద్యలు. చిన్న పరిశ్రమల కష్టాలను తామే తీర్చేస్తున్నంతగా మాటలు చెబుతూ.. ఉత్త చేయి అందించడం ప్రభుత్వానికే చెల్లింది. -
దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులు హుష్‌కాకి
విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనలో దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులు మాయమయ్యాయి. -
Cyclone Michaung: ముంచుకొస్తున్న తుపాను
నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన మిగ్జాం తుపాను మంగళవారం తీవ్ర తుపానుగా బలపడనుంది. -
తమిళనాడు వాసులకు తాడికొండలో ఓట్లు
తమిళనాడు వాసులకు తాడికొండలో ఓట్లు.. కాకినాడ, తిరుపతి చిరునామాలతో రాజంపేట జాబితాలో చోటు.. అసలు ఎవరో తెలియనివారి పేరిట వందలాది ఓట్లు.. ఒకే డోర్నంబరుతో పదులకొద్దీ బోగస్ ఓట్లు.. రాష్ట్ర ఓటర్ల జాబితా పరిశీలిస్తున్నా కొద్దీ ఇలా లెక్కలేనన్ని అక్రమాలు, అవకతవకలు బయటపడుతూనే ఉన్నాయి. -
సాగర్ వద్ద సాధారణ పరిస్థితులు
నాగార్జునసాగర్ జలాశయం వద్ద పరిస్థితులు యథాస్థితికి వచ్చాయి. నవంబరు 29కి ముందునాటి వాతావరణం నెలకొంది. -
ఆర్‌అండ్‌బీని భయపెడుతున్న తుపాను
రాష్ట్రాన్ని వణికిస్తున్న తుపాను.. రహదారులు భవనాలశాఖ ఇంజినీర్లను కూడా భయపెడుతోంది. తుపాను తీవ్రతతో రహదారులు దెబ్బతింటే చేతులెత్తేయాల్సిన దుస్థితిలో ఇంజినీర్లు ఉన్నారు. -
కళ్ల ముందు 1977 నాటి పీడకల!
మిగ్జాం తీవ్ర తుపాను కృష్ణా జిల్లా దివిసీమ దగ్గరలో తీరం దాటనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. దీని కేంద్ర స్థానం నుంచి 200 కి.మీ. మేర ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. -
కేసీఆర్ కన్నా జగన్ చిత్తుగా ఓడిపోతారు
మూడు రాజధానులంటూ అమరావతిని అరణ్యంలా మారుస్తున్న సీఎం జగన్.. భారాస అధినేత కేసీఆర్ కన్నా చిత్తుగా ఓడిపోతారని రాజధాని రైతులు ధ్వజమెత్తారు. -
మేము రాము బిడ్డో జగనన్న కాలనీకి..!
నంద్యాల జిల్లా డోన్ సమీపంలోని దొరపల్లె గుట్ట వద్ద ఉన్న జగనన్న కాలనీలోకి ఇంటి నిర్మాణ సామగ్రిని తీసుకెళ్లలేకపోతున్నామని ఆటో డ్రైవర్లు తెగేసి చెప్పేస్తున్నారు. -
కల్లాల్లో ధాన్యం.. కళ్లల్లో దైన్యం..
తుపాను హెచ్చరికలతో రైతులకు కంటిమీద కునుకు లేకుండాపోయింది. ఏ క్షణంలో గాలులు వీచి చేతికొచ్చిన పంట నేలవాలుతుందోనని ఆందోళన చెందుతున్నారు. -
తిరుమలలో ఘనంగా కార్తిక స్నపన తిరుమంజనం
పవిత్ర కార్తిక మాసంలో నిర్వహించే కార్తిక వనభోజన మహోత్సవంలో భాగంగా ఆదివారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారికి స్నపన తిరుమంజనం అత్యంత వైభవంగా జరిగింది. -
ఇలా ఇచ్చారు.. అలా చక్రం ఊడింది!
బ్యాటరీ ట్రై సైకిళ్లకు చక్రాలు సరిగ్గా బిగించకుండానే పంపిణీ చేయడంతో వైయస్ఆర్ జిల్లా మైదుకూరులో ప్రమాదవశాత్తు ఓ దివ్యాంగుడు కింద పడ్డారు. -
కుప్పం ఓటరు జాబితా సవరణలో విచిత్ర దరఖాస్తు
చిత్తూరు జిల్లా కుప్పంలోని ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో విచిత్ర పరిస్థితి నెలకొంది. పురపాలికలోని 173వ పోలింగ్ బూత్ పరిధిలో.. మరణించిన మహిళ ఓటును తొలగించాలని మృతి చెందిన ఇంకో మహిళ పేరుతో ఫారం-7 దాఖలు అయింది. -
రచయితలపై సామాజిక బాధ్యత
కవులు, రచయితలు, కథకులపై సామాజిక బాధ్యత ఉందని కవి కె.శివారెడ్డి పేర్కొన్నారు. -
ఎయిర్ ఇండియా విమానం రద్దు
తుపాను కారణంగా విమాన ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. న్యూదిల్లీ నుంచి హైదరాబాదు మీదుగా తిరుపతి జిల్లా రేణిగుంటకు ప్రతిరోజూ రాకపోకలు సాగించే ఎయిర్ ఇండియా విమానాన్ని ఆదివారం రద్దు చేశారు. -
అమర్యాదగా మాట్లాడటం సరికాదు
విశాఖ జిల్లా పద్మనాభం మండలం ఎంపీడీఓపై భీమిలి వైకాపా ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు అమర్యాదగా మాట్లాడటం సరికాదని ఏపీ పంచాయతీరాజ్ అధికారుల సంఘం మండిపడింది. -
బకాయిల తుది గడువుపై ఏం చేద్దాం?
ప్రభుత్వ బకాయిలను రాబట్టుకునేందుకు బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బాయ్) సోమవారం మరోసారి భేటీ కానుంది. -
ఉద్యోగుల్ని వేధిస్తే తెలంగాణ ఫలితాలే
ఉద్యోగుల్ని, ఉపాధ్యాయుల్ని వేధిస్తే తెలంగాణలో బీఆర్ఎస్కు ఎదురైన ఫలితాలే ఏపీలోనూ పునరావృతమవుతాయని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం హెచ్చరించింది. -
ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవోగా అభిషిక్త్ కిశోర్ నియామకం
ఆర్థికశాఖ డిప్యూటీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న ఎమ్.అభిషిక్త్ కిశోర్‌ను ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ సీఈవోగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. -
ఇదీ సంగతి!


తాజా వార్తలు (Latest News)
-
Telangana Election Results: అప్పుడలా.. ఇప్పుడిలా..!
-
Hyderabad: భారాసకు జైకొట్టిన కాలనీలు, బస్తీలు
-
Telangana Elections: తొలి అడుగులోనే సంచలన గెలుపు
-
Hyderabad: హ్యాట్రిక్ వీరులు.. హైదరాబాద్‌లో 10 మంది..
-
Telangana Election Results: 51 మంది అభ్యర్థులకు 50% పైగా ఓట్లు
-
BRS: భారాసకి కొరుకుడుపడని 6 స్థానాలివే..