CM Jagan: దళిత యువకుడి మృతి.. హోంమంత్రిని ప్రశ్నించిన ముఖ్యమంత్రి జగన్‌!

హోంమంత్రి తానేటి వనిత, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జునలను సీఎం జగన్‌ సోమవారం తన క్యాంపు కార్యాలయానికి పిలిపించుకున్నారు.

Updated : 21 Nov 2023 08:08 IST

ఈనాడు, అమరావతి: హోంమంత్రి తానేటి వనిత, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జునలను సీఎం జగన్‌ సోమవారం తన క్యాంపు కార్యాలయానికి పిలిపించుకున్నారు. హోంమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొవ్వూరు నియోజకవర్గంలో ఇటీవల పోలీసులు నిర్భందించారని మనస్థాపంతో బొంతా మహేంద్ర అనే దళిత యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన, తదనంతర పరిణామాలపై వారిద్దరితో చర్చించారు. బాధితుడి గ్రామానికి వెళ్లినపుడు మంత్రి వనితను జనం రోడ్డుపై అడ్డుకున్న విషయం తెలిసిందే. అక్కడి ఎమ్మెల్యే, మంత్రి అయిన ఆమెను స్థానిక ఎస్సీలే అలా రోడ్డుపై అడ్డుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందనే దానిపై మంత్రులిద్దరినీ సీఎం వేర్వేరుగా అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. పార్టీలో వర్గపోరే మహేంద్ర మృతికి దారితీసిందన్న వార్తలపైనా సీఎం చర్చించినట్లు తెలుస్తోంది. ‘పరిస్థితి అంత దూరం ఎందుకు వచ్చింది..? నియోజకవర్గంలో అసలేం జరుగుతోంది? ఘటన తర్వాత పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం ఏమైనా చేశారా?’ అని సీఎం ప్రశ్నించారని విశ్వసనీయ సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని