సీబీఐ కోర్టుకు హాజరైన ఎంపీ అవినాష్‌ రెడ్డి

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన వైకాపా ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి మంగళవారం హైదరాబాద్‌ సీబీఐ కోర్టు ముందు హాజరయ్యారు.

Updated : 12 Jun 2024 06:51 IST

ఈనాడు, హైదరాబాద్‌: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన వైకాపా ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి మంగళవారం హైదరాబాద్‌ సీబీఐ కోర్టు ముందు హాజరయ్యారు. ఆయనతో పాటు 4వ నిందితుడైన దస్తగిరి, 5వ నిందితుడైన డి.శివశంకర్‌రెడ్డి, 7వ నిందితుడైన వైఎస్‌ భాస్కరరెడ్డిలు హాజరయ్యారు. ప్రధాన నిందితుడైన టి.గంగిరెడ్డి అలియాస్‌ ఎర్రగంగిరెడ్డి, యాదాటి సునీల్‌యాదవ్, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డిలను జైలు అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరుపరిచారు. వీరి రిమాండ్‌ను 21వ తేదీ వరకు పొడిగిస్తూ సీబీఐ కోర్టు జడ్జి టి.రఘురాం ఉత్తర్వులు జారీ చేశారు. కేసు విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేశారు. తనను నిందితుల జాబితా నుంచి తొలగించి సాక్షిగా పరిగణించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ దస్తగిరి పెట్టుకున్న పిటిషన్‌పై కూడా విచారణను అదే తేదీకి వాయిదా వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని