వాహనదారుల్ని ఇబ్బంది పెట్టొద్దని బాబు ఆదేశం

తన వాహనశ్రేణి వెళ్తున్న మార్గంలో ట్రాఫిక్‌ నిలిపివేతపై తెదేపా అధినేత, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు.

Published : 12 Jun 2024 05:28 IST

ఈనాడు డిజిటల్, అమరావతి: తన వాహనశ్రేణి వెళ్తున్న మార్గంలో ట్రాఫిక్‌ నిలిపివేతపై తెదేపా అధినేత, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో పాల్గొనేందుకు మంగళవారం ఆయన విజయవాడ వచ్చారు. చంద్రబాబు వెళ్లే బందరు రోడ్డులో వాహనదారుల రాకపోకల్ని పోలీసులు నిలిపివేశారు. దీన్ని గమనించిన ఆయన.. తన వాహనశ్రేణి వెళ్లే మార్గంలో వాహనదారుల్ని ఎక్కువ సేపు ఆపొద్దని, వీలైనంత తక్కువ సమయమే వారు వేచి ఉండేలా చూడాలని భద్రతాధికారులకు సూచించారు. వీటిని పోలీసులకూ తెలియజేయాలని ఆదేశించారు. ఇటీవల కూడా ఈ విషయమై చంద్రబాబు భద్రతాధికారులకూ పలు సూచనలు చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని