అత్యున్నత స్థాయి జర్నలిజంలో ఒక శకం ముగిసింది

రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు కన్నుమూయడంతో అత్యున్నత స్థాయి ప్రాంతీయ జర్నలిజంలో ఒక శకం ముగిసినట్లయిందని ప్రధాన మంత్రి మాజీ కార్యదర్శి, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి కేఆర్‌ వేణుగోపాల్‌ పేర్కొన్నారు.

Published : 12 Jun 2024 05:32 IST

రామోజీరావు మృతికి కేఆర్‌ వేణుగోపాల్‌ సంతాపం

ఈనాడు, హైదరాబాద్‌: రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు కన్నుమూయడంతో అత్యున్నత స్థాయి ప్రాంతీయ జర్నలిజంలో ఒక శకం ముగిసినట్లయిందని ప్రధాన మంత్రి మాజీ కార్యదర్శి, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి కేఆర్‌ వేణుగోపాల్‌ పేర్కొన్నారు. రామోజీ తన జర్నలిజం ద్వారా జాతీయ ప్రాధాన్యమున్న ఎన్నో అంశాలను ప్రభావితం చేయగలిగారని తెలిపారు. 1982లో ‘ఈనాడు’ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఒంటిచేత్తో విప్లవాత్మక మార్పునకు నాంది పలికారని వివరించారు. ఫలితంగానే ఎన్నో ఏళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను.. తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే ఎన్టీఆర్‌ ఓడించగలిగారని పేర్కొన్నారు. రావడంతోనే ఎన్టీఆర్‌ తెచ్చిన సంస్కరణలు, జాతీయ స్థాయిలో తెదేపా చూపిన ప్రభావం వెనక ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒక దినపత్రికగా ‘ఈనాడు’ పాత్ర ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదని వ్యాఖ్యానించారు. రామోజీరావు కుటుంబానికి, ‘ఈనాడు’ పరివారానికి కేఆర్‌ వేణుగోపాల్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని