చంద్రబాబును చూడాలని.. కాన్వాయ్‌ వెంట మహిళ పరుగులు

తనని చూసేందుకు కాన్వాయ్‌ వెంట పరుగులు తీసిన ఓ మహిళను చూసి తెదేపా అధినేత చంద్రబాబు కారు ఆపి పలకరించారు. ఈ ఘటన విజయవాడలో మంగళవారం చోటుచేసుకుంది.

Published : 12 Jun 2024 06:06 IST

కారు ఆపి పలకరించిన తెదేపా అధినేత

చంద్రబాబు వాహనశ్రేణి వెంట పరుగులు తీస్తున్న మదనపల్లె మహిళ నందిని

ఈనాడు డిజిటల్, అమరావతి: తనని చూసేందుకు కాన్వాయ్‌ వెంట పరుగులు తీసిన ఓ మహిళను చూసి తెదేపా అధినేత చంద్రబాబు కారు ఆపి పలకరించారు. ఈ ఘటన విజయవాడలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానిక ఏ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశం ముగిశాక చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి పయనమయ్యారు. ఈ సమయంలో మదనపల్లెకు చెందిన నందిని అనే మహిళ వాహనశ్రేణి వెంట అరుస్తూ పరుగులు తీశారు. ఇది గమనించిన చంద్రబాబు కాన్వాయ్‌ని ఆపించి ఆమెను తన దగ్గరకు పిలిచి పలకరించారు.

వాహనం ఆపి సమస్య వింటున్న చంద్రబాబునాయుడు

భావోద్వేగానికి గురైన ఆమె.. ‘మీ మీదున్న అభిమానంతో మిమ్మల్ని చూడటానికి ఇక్కడిదాకా వచ్చాను. మా కష్టం ఫలించి, మా కోరిక మేరకు మీరు సీఎం కానున్నారు. ఒక్కసారి మీ కాళ్లు మొక్కుతాను సార్‌’ అనగా చంద్రబాబు సున్నితంగా తిరస్కరించారు. అనంతరం ఆమెతో ఫొటో దిగారు. జ్వరంతో బాధపడుతున్న చూడటానికి వచ్చానని చెప్పగా.. ముందు ఆసుపత్రికి వెళ్లి చూపించుకోవాలని సూచించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని