నేడు కుటుంబ సమేతంగా తిరుమలకు చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు రానున్నారు.

Published : 12 Jun 2024 05:36 IST

తిరుమల, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు రానున్నారు. సాయంత్రం 6.45 గంటలకు విజయవాడ నుంచి విమానంలో బయలుదేరి రాత్రి 7.45 గంటలకు రేణిగుంటకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో బయలుదేరి రాత్రి 8.50 గంటలకు తిరుమల చేరుకుని స్థానిక గాయత్రి అతిథిగృహంలో బసచేస్తారు. గురువారం ఉదయం 7.30 నుంచి 8 గంటల మధ్య శ్రీవారిని దర్శించుకుంటారు. 10 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని విజయవాడకు బయలుదేరనున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని