కొత్త పరిశ్రమల ఏర్పాటుకు కృషి.. కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవర్మ

రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు తీవ్రంగా కృషి చేస్తానని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమలశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు.

Published : 12 Jun 2024 05:38 IST

 

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు తీవ్రంగా కృషి చేస్తానని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమలశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.    వైకాపా పాలనలో రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రాకపోగా అప్పటికే ఉన్నవి కూడా తరలిపోయాయన్నారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే వారికి ప్రోత్సాహం ఉంటుందని వెల్లడించారు.

చంద్రబాబు, లోకేశ్‌లను కలిసిన శ్రీనివాసవర్మ 

ఈనాడు డిజిటల్, అమరావతి : తెదేపా అధినేత చంద్రబాబు, తెదేపా ప్రధానకార్యదర్శి నారా లోకేశ్‌లను కేంద్ర సహాయమంత్రి శ్రీనివాసవర్మ మంగళవారం  రాత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా వర్మను చంద్రబాబు అభినందించారు. శాలువ, పుష్పగుచ్ఛంతో సత్కరించారు. కార్యక్రమంలో విశాఖ ఎంపీ భరత్‌ తదితరులు ఉన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని