విశాఖలో ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయం

రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ప్రాంతీయ కార్యాలయం విశాఖలో ఏర్పాటు చేయాలని సంస్థ ఉన్నతాధికారులు నిర్ణయించారు.

Published : 13 Jun 2024 05:50 IST

కలెక్టర్‌తో చర్చించిన ఆర్‌బీఐ జీఎం

ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు ఎంపిక చేసిన భవనం 

విశాఖపట్నం(వన్‌టౌన్‌), న్యూస్‌టుడే: రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ప్రాంతీయ కార్యాలయం విశాఖలో ఏర్పాటు చేయాలని సంస్థ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయం హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తోంది. గత కొంత కాలంగా విశాఖలో ప్రాంతీయ కార్యాలయ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో బ్యాంకు జనరల్‌ మేనేజర్‌ రాజ్‌కుమార్‌ మహానా బుధవారం కలెక్టర్‌ మల్లికార్జునతో సమావేశమయ్యారు. ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయానికి 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న భవనం అవసరమని ప్రతిపాదించారు. దీని కోసం సిరిపురం కూడలిలోని వీఎంఆర్‌డీఏ కార్యాలయం ఎదురుగా మల్టీ లెవెల్‌ పార్కింగ్‌ కోసం నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనంలో అయిదో అంతస్తును కేటాయించాలని ఆర్‌బీఐ కోరుతోంది. ఈ అంతస్తు విస్తీర్ణం 10 వేల చదరపు అడుగుల వరకు ఉంది. అది తమకు ఉపయుక్తంగా ఉంటుందని, భవన నిర్మాణ పనులు ఎప్పటికి పూర్తవుతాయని జీఎం ఆరా తీశారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్‌ మల్లికార్జున ఆర్‌బీఐ అధికారికి స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు