వాతావరణ మార్పులతో వ్యవసాయ రంగానికి సవాళ్లు

వాతావరణ మార్పులతో వ్యవసాయ రంగం సవాళ్లు ఎదుర్కొంటుందని ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు ప్రిన్సిపల్‌ క్లైమేట్‌ ఛేంజ్‌ స్పెషలిష్ట్‌ డాక్టర్‌ శ్రీనివాసన్‌ అన్నారు.

Published : 13 Jun 2024 05:52 IST

ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ  60వ వ్యవస్థాపక దినోత్సవంలో డాక్టర్‌ శ్రీనివాసన్‌

అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్‌ శ్రీదేవికి బంగారు పతకం, జ్ఞాపిక అందజేస్తున్న వీసీ శారద జయలక్ష్మీదేవి. చిత్రంలో శ్రీనివాసన్‌ 

గుంటూరు(జిల్లాపరిషత్తు), న్యూస్‌టుడే: వాతావరణ మార్పులతో వ్యవసాయ రంగం సవాళ్లు ఎదుర్కొంటుందని ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు ప్రిన్సిపల్‌ క్లైమేట్‌ ఛేంజ్‌ స్పెషలిష్ట్‌ డాక్టర్‌ శ్రీనివాసన్‌ అన్నారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 60వ వ్యవస్థాపక దినోత్సవాన్ని వర్సిటీ ఉపకులపతి డాక్టర్‌ ఆర్‌.శారద జయలక్ష్మీదేవి అధ్యక్షతన బుధవారం గుంటూరు శివారులో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీనివాసన్‌ ‘వాతావరణంలో మార్పులకు అనుగుణంగా 2050లో వ్యవసాయం’ అనే అంశంపై ప్రసంగించారు. గ్రీన్‌హౌస్‌ వాయువులు 45 శాతం వరకు తగ్గించాలన్నారు. వాతావరణ మార్పుల ప్రతికూలతను ఎదుర్కోవడానికి తమ బ్యాంకు ఏటా 13 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేస్తుందని వివరించారు. వర్సిటీ ఉపకులపతి శారద జయలక్ష్మీదేవి మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన అనంతరం వర్సిటీ విడుదల చేసిన నూతన వంగడాలు వాతావరణ మార్పులను తట్టుకునేలా ఉన్నాయన్నారు. జాతీయస్థాయిలో వర్సిటీ 16 పురస్కారాలు సాధించినట్లు వెల్లడించారు. అనంతరం 2022-23లో వ్యవసాయ రంగంలో కృషిచేసిన శాస్త్రవేత్తలు, రైతులకు వివిధ సంస్థలు ప్రకటించిన పురస్కారాలను అందజేశారు. కార్యక్రమంలో నాబార్డు డీజీఎం ఎం.ఎస్‌.ఆర్‌.చంద్రమూర్తి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని