మంచి రోజులొచ్చాయ్‌..

రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడంతో రాజధాని గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. తుళ్లూరులోని దీక్షా శిబిరంలో భారీ ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేయడంతో బుధవారం రైతులు, రైతు కూలీలు, మహిళలు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్, ఇతర మంత్రుల ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని తిలకించారు.

Updated : 13 Jun 2024 08:10 IST

సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారంపై హర్షాతిరేకాలు
అమరావతి రాజధాని గ్రామాల్లో రైతుల సంబరాలు

ఆనందోత్సాహంతో నృత్యం చేస్తున్న రాజధాని మహిళలు, రైతులు 

తుళ్లూరు, న్యూస్‌టుడే: రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడంతో రాజధాని గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. తుళ్లూరులోని దీక్షా శిబిరంలో భారీ ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేయడంతో బుధవారం రైతులు, రైతు కూలీలు, మహిళలు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్, ఇతర మంత్రుల ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని తిలకించారు. ఐదేళ్లుగా తాము పడిన బాధలు తొలగిపోయి.. అమరావతికి మంచి రోజులు వచ్చాయంటూ సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో పసుపు బెలూన్లు ఊపుతూ.. రంగులు చల్లుకొంటూ సందడి చేశారు. యువత టపాసులు కాల్చుతూ, తెదేపా జెండాలు చేతపట్టి కేరింతలు కొట్టింది.. రాజధాని గ్రామాలు పసుపుమయంగా మారాయి. డీజేలు పెట్టుకొని మరీ రహదారులపై నృత్యాలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని