రాజధానిలో శ్రీవారి రథోత్సవం

కూటమి ప్రభుత్వం కొలువుదీరడంతో రాజధాని గ్రామాల్లో సందడి నెలకొంది. ఐదేళ్లుగా తాము పడిన బాధలు తొలగిపోయాయని సంబరాలు చేశారు.

Published : 13 Jun 2024 05:58 IST

సంతోషంతో ఓ వృద్ధ మహిళ

కూటమి ప్రభుత్వం కొలువుదీరడంతో రాజధాని గ్రామాల్లో సందడి నెలకొంది. ఐదేళ్లుగా తాము పడిన బాధలు తొలగిపోయాయని సంబరాలు చేశారు. కలియుగ దైవం వేెంకటేశ్వరస్వామి తమ మొర ఆలకించారంటూ బుధవారం మొక్కులు చెల్లించారు. అమరావతి ఉద్యమంలో భాగంగా ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పేరుతో తుళ్లూరు నుంచి తిరుమల తిరుపతి వరకు చేపట్టిన మహాపాదయాత్రలో అన్నదాతలు తమ వెంట తీసుకెళ్లిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి రథాన్ని తుళ్లూరు గ్రామ వీధుల్లో ఊరేగించారు. మేళతాళాలతో కార్యక్రమం కోలాహలంగా సాగింది. ఈ సందర్భంగా ఈ ప్రాంతమంతా ‘జై అమరావతి.’, ‘ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని’ అన్న నినాదాలతో హోరెత్తింది.

తుళ్లూరు రథయాత్రలో పాల్గొన్న రాజధాని రైతులు, మహిళలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని