ఆసుపత్రిలో చేరినందునే ప్రమాణస్వీకార కార్యక్రమానికి వెళ్లలేదు

అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినందుకే.. చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకాలేదని మాజీ మంత్రి, కైకలూరు నుంచి భాజపా ఎమ్మెల్యేగా గెలిచిన కామినేని శ్రీనివాస్‌ తెలిపారు.

Published : 13 Jun 2024 06:00 IST

మాజీ మంత్రి, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌ 

ఈనాడు, అమరావతి: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినందుకే.. చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకాలేదని మాజీ మంత్రి, కైకలూరు నుంచి భాజపా ఎమ్మెల్యేగా గెలిచిన కామినేని శ్రీనివాస్‌ తెలిపారు. ‘నాలుగు రోజుల కిందట తీవ్రమైన ఇన్ఫెక్షన్, కొవిడ్‌ లక్షణాలతో ఆసుపత్రిలో చేరా. వైద్యులు చికిత్స అందించడంతో కోలుకున్నా. మరో 4 రోజుల వరకు ఆసుపత్రిలోనే ఉండాలని వైద్యులు సూచించారు. అందువల్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాలేదు. త్వరలో అందర్ని కలుస్తాను’ అని కామినేని శ్రీనివాస్‌ బుధవారం విడుదల చేసిన వీడియో సందేశంలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని