ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ రద్దు.. ప్రభుత్వానికి న్యాయవాదుల కృతజ్ఞతలు

ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టాన్ని( టైట్లింగ్‌ యాక్ట్‌) రద్దు చేస్తూ సీఎం చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తొలిరోజే సంతకం చేయడంపై రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

Published : 14 Jun 2024 04:43 IST

టైట్లింగ్‌ యాక్ట్‌ రద్దు సందర్భంగా కేకు కోసి హర్షం వ్యక్తంచేస్తున్న బెజవాడ బార్‌ అసోసియేషన్‌ సభ్యులు

ఈనాడు, అమరావతి: ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టాన్ని( టైట్లింగ్‌ యాక్ట్‌) రద్దు చేస్తూ సీఎం చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తొలిరోజే సంతకం చేయడంపై రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదుల్లో హర్షం వ్యక్తమవుతోంది. కొన్ని ప్రాంతాల్లో కేకులు కోసి వేడుకలు చేసుకున్నారు. ప్రజల స్థిరాస్తులకు ఈ చట్టంతో ముప్పుఉందని ముందే పసిగట్టిన న్యాయవాదులు రాష్ట్రవ్యాప్తంగా మూడు నెలలు కోర్టు విధులను బహిష్కరించడంతో పాటు పలు నిరసన కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. 

ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ రద్దు చేసినందుకు ఏపీ బార్‌ కౌన్సిల్‌ మాజీ ఛైర్మన్‌ గంటా రామారావు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తాను బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు ఈ చట్టాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిల్‌ దాఖలు చేసినట్లు గుర్తుచేశారు. ్య ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్టు రద్దుచేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకం చేయడం అభినందనీయమని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సభ్యులు, సీనియర్‌ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని