ఇక నుంచి మీకు చాలా పని ఉంటుంది

‘ఇక నుంచి మీకు చాలా పని ఉంటుంది. పాలనలో సమూల మార్పును చూస్తారు. అన్ని చోట్లా మార్పు కనిపిస్తుంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా ప్రతినిధులతో అన్నారు.

Published : 14 Jun 2024 04:44 IST

 మీడియా ప్రతినిధులతో సీఎం చంద్రబాబు
ఐదేళ్ల తర్వాత సీఎంను కలిసే అవకాశమొచ్చిందన్న పాత్రికేయులు 

ఈనాడు డిజిటల్, అమరావతి: ‘ఇక నుంచి మీకు చాలా పని ఉంటుంది. పాలనలో సమూల మార్పును చూస్తారు. అన్ని చోట్లా మార్పు కనిపిస్తుంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా ప్రతినిధులతో అన్నారు. రాష్ట్ర సచివాలయంలో గురువారం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఉండవల్లి నివాసానికి తిరిగి వెళుతున్న క్రమంలో ఆయన మీడియా ప్రతినిధులను చూసి కారు ఆపారు. సీనియర్‌ పాత్రికేయుల్ని పేరుపేరునా పలకరించారు. ఐదేళ్ల తర్వాత తాము సీఎంను కలిశామని.. స్వేచ్ఛగా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నామని ఈ సందర్భంగా వారు చంద్రబాబుకు వివరించారు. రాష్ట్ర సచివాలయ వార్తలు కవర్‌ చేస్తున్నా ఈ ఐదేళ్లలో సీఎంను కలిసే అవసరం రాలేదని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని