విద్యార్థి కిట్లను పంపిణీ చేయండి: అధికారులకు సీఎం ఆదేశం

విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ‘విద్యార్థి కిట్‌’లను పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు రెండు రోజుల క్రితం ఆదేశాలు ఇచ్చారని సమగ్ర శిక్షా అభియాన్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ శ్రీనివాసరావు గురువారం వెల్లడించారు.

Published : 14 Jun 2024 04:44 IST

ఈనాడు, అమరావతి: విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ‘విద్యార్థి కిట్‌’లను పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు రెండు రోజుల క్రితం ఆదేశాలు ఇచ్చారని సమగ్ర శిక్షా అభియాన్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ శ్రీనివాసరావు గురువారం వెల్లడించారు. త్వరలో కిట్‌ల నాణ్యతపై పరిశీలన చేయిస్తామని, ఏమైనా లోపాలు గుర్తిస్తే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించినట్లు తెలిపారు. ‘‘విద్యార్థులకు ఇస్తున్న కిట్‌లలోని వస్తువులపై ఎలాంటి ఫొటోగానీ, రాజకీయ పరమైన చిహ్నంగానీ, పేర్లుగానీ ముద్రించలేదు. మార్చి 19న గుత్తేదారులతో జరిగిన సమావేశంలో ఆ మేరకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. అక్కడక్కడా గత విద్యా సంవత్సరాల్లో మిగిలిన వాటిని చూపించి తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. పాత వస్తువులను పంపిణీ చేయకూడదని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. ఈ ఆదేశాలను ఉల్లంఘించే సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం’’ అని హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని