నా మనసును హత్తుకున్నావ్‌.. నారా రోహిత్‌ పోస్టుపై చంద్రబాబు

రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ తన సోదరుడి కుమారుడు, నటుడు నారా రోహిత్‌ రాసిన లేఖపై సీఎం చంద్రబాబు స్పందించారు.

Published : 14 Jun 2024 05:18 IST

ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ తన సోదరుడి కుమారుడు, నటుడు నారా రోహిత్‌ రాసిన లేఖపై సీఎం చంద్రబాబు స్పందించారు. ‘‘ప్రియమైన నారా రోహిత్, నీ లేఖ నా మనసును హత్తుకుంది. మన కుటుంబ సభ్యుల అండ, ఆశీస్సులు సదా నా వెంట ఉన్నాయి కాబట్టే ఎన్ని ఒడుదొడుకులు వచ్చినా నిలబడగలిగాను. నీకు ఎల్లప్పుడూ నా శుభాశీస్సులు వెన్నంటి ఉంటాయి. ప్రేమతో నీ పెదనాన్న’’ అని ‘ఎక్స్‌’లో చంద్రబాబు పేర్కొన్నారు. రోహిత్‌ రాసిన లేఖను రీపోస్ట్‌ చేశారు. 

ప్రజల గుండెల్లో మీది కదిలించలేని స్థానం 

‘‘పెదనాన్నా.. గత నాలుగు దశాబ్దాలుగా మీరు రాజకీయాల్లో ఉన్నారు. ఎన్నో ఒడుదొడుకులను చూశారు. తట్టుకున్నారు. ఆత్మవిశ్వాసంతో నిలబడ్డారు. కానీ గత అయిదేళ్ల కాలంలో ఎంతో మధనపడ్డారు. పార్టీని, కార్యకర్తల్ని కంటికి రెప్పలా కాపాడుకున్నారు. మీకు కష్టం వచ్చినప్పుడు వాళ్లు అందరూ కుల, మత, ప్రాంతాలకు అతీతంగా మీ కోసం నిలబడ్డారు. అప్పుడు తెలిసింది మీ కష్టానికి మీరు పొందింది ప్రజల గుండెల్లో కదిలించలేని స్థానం అని. చరిత్రలో ఎవరూ మళ్లీ తిరగరాద్దామనే సాహసం చేయలేని విజయాన్ని మీరు అందుకున్నారు. ఆ విజయం ఎన్డీయేదే కాదు. రాష్ట్ర ప్రజలది. తెలుగువారందరిదీ’’అని లేఖలో రోహిత్‌ పేర్కొన్నారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని