యువతలో ఏం నైపుణ్యాలున్నాయి?

రాష్ట్రంలో నైపుణ్య గణన (స్కిల్‌ సెన్సస్‌)-2024 చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Published : 14 Jun 2024 05:19 IST

 పరిశ్రమలకు ఏం కావాలి? 
అంతరాన్ని తగ్గించేలా.. నైపుణ్య గణనకు ఉత్తర్వులు  

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో నైపుణ్య గణన (స్కిల్‌ సెన్సస్‌)-2024 చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నైపుణ్య గణన దస్త్రంపై సీఎం చంద్రబాబు సంతకం చేసిన వెంటనే గణనకు మార్గదర్శకాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. నిర్మాణ, ఉత్పత్తి, సేవా రంగాలకు సంబంధించి యువతలో ఏ మేరకు నైపుణ్యాలు ఉన్నాయో గుర్తిస్తారు. పరిశ్రమల అవసరాలు, యువతకు మధ్య ఉన్న నైపుణ్య అంతరాన్ని గుర్తించి, అందుకు అనుగుణంగా శిక్షణ ఇస్తారు. రాష్ట్రంలో 310 ఇంజినీరింగ్‌ కళాశాలలు, 1400 డిగ్రీ కళాశాలలు, 267 పాలిటెక్నిక్‌లు, 516 ఐటీఐలు ఉన్నాయి. వీటి నుంచి ఏటా 4.4 లక్షల మంది విద్యార్థులు బయటకు వస్తున్నా సరైన నైపుణ్యాలు లేక చాలామంది నిరుద్యోగులుగానే మిగులుతున్నారు. వీరిలో ఎలాంటి నైపుణ్యాలు ఉన్నాయి? పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఎలాంటి నైపుణ్యాలు అవసరమో గణన గుర్తిస్తుంది. ఈ సర్వేకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) నోడల్‌ ఏజెన్సీగా ఉంటుంది. పోటీకి అనుగుణంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకునేలా యువతకు శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన సిఫార్సులు చేస్తుంది.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని