ఏపీలో పరదాల సంస్కృతికి తెర!

తిరుమలలో సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేసిన పరదాలను అధికారులు తొలగించారు. గత సీఎం జగన్‌ పర్యటన సందర్భంగా పరదాలు ఏర్పాటు చేసేవారు.

Updated : 14 Jun 2024 16:33 IST

తిరుమలలోని అతిథిగృహం వద్ద బుధవారం రాత్రి కనిపించిన పరదాలు 

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమలలో సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేసిన పరదాలను అధికారులు తొలగించారు. గత సీఎం జగన్‌ పర్యటన సందర్భంగా పరదాలు ఏర్పాటు చేసేవారు. అదే తరహాలో ఇప్పుడు చంద్రబాబు వెళ్లనున్న మార్గాల్లోనూ తెరలు కట్టారు. అయితే.. తన పర్యటనలో పరదాలు కట్టి, అనవసర ఆంక్షలు పెట్టొద్దని సీఎం చంద్రబాబు అధికారులకు ఇప్పటికే స్పష్టం చేశారు. పాత పద్ధతులు వీడాలని, సీఎంను ప్రజలకు దూరం చేసే చర్యలు చేపట్టొద్దని సూచించారు. దీంతో అధికారులు బుధవారం రాత్రి నుంచి ఆ పరదాల తొలగింపు చేపట్టారు.  

చంద్రబాబు సూచనలతో ఆయన బస చేసిన అతిథిగృహం సమీపంలో పరదాలు తొలగించాక ఇలా


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని