శ్రీవారి సేవలో కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌

కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ దంపతులు గురువారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో గోయల్‌ దంపతులు, రాష్ట్ర మంత్రి నారాయణ మహద్వారం గుండా ఆలయానికి చేరుకున్నారు.

Published : 14 Jun 2024 05:25 IST

తిరుమల, న్యూస్‌టుడే: కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ దంపతులు గురువారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో గోయల్‌ దంపతులు, రాష్ట్ర మంత్రి నారాయణ మహద్వారం గుండా ఆలయానికి చేరుకున్నారు. వీరికి తితిదే అధికారులు స్వాగతం పలికి శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం, తితిదే అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. అప్పటికే రంగనాయకుల మండపంలో ఉన్న సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులను పీయూష్‌ గోయల్‌ దంపతులు కలిసి మాట్లాడారు.  చంద్రబాబుకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.  


గోయల్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

తిరుమలలో కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌తో సీఎం చంద్రబాబు. చిత్రంలో మంత్రి నారాయణ 

ఈనాడు డిజిటల్, అమరావతి : దేశ వాణిజ్యం, పరిశ్రమలు అంతర్జాతీయంగా పోటీపడేలా చేసిన ఘనత కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌కు దక్కుతుందని సీఎం చంద్రబాబు కొనియాడారు. ఎక్స్‌ వేదికగా గురువారం గోయల్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నిండునూరేళ్లు సంతోషం, ఆరోగ్యంతో ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని