కూటమి విజయంపై కొలరాడోలో విజయోత్సవం

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి విజయాన్ని పురస్కరించుకుని అమెరికాలోని కొలరాడోలో ఎన్టీఆర్‌ అభిమాన సంఘం ఆధ్వర్యంలో విజయోత్సవం నిర్వహించారు.

Updated : 14 Jun 2024 06:38 IST

బాణసంచా కాలుస్తున్న ప్రవాసాంధ్రులు

ఈనాడు, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి విజయాన్ని పురస్కరించుకుని అమెరికాలోని కొలరాడోలో ఎన్టీఆర్‌ అభిమాన సంఘం ఆధ్వర్యంలో విజయోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. చంద్రబాబునాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి బాటలో నడుస్తుందని, సస్యశ్యామల విశ్వనగరంగా అమరావతి రూపుదిద్దుకుంటుందని, మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని పలువురు వక్తలు ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో జరిగిన అరాచక పాలనకు ప్రజలు తమ ఓటుతో చరమగీతం పాడారన్నారు. కక్షలు, కార్పణ్యాల రాజకీయాలకు ఆంధ్రప్రదేశ్‌లో తావులేదని చంద్రబాబుకు ఏకపక్ష విజయం అందించడం ద్వారా ప్రజలు నిరూపించారని చెప్పారు. ఈ సందర్భంగా బాణసంచా కాల్చారు. 

విజయోత్సవంలో పాల్గొన్న మహిళలు 


రామోజీరావుకు నివాళి

అంతకుముందు రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించి.. నివాళి అర్పించారు. తెలుగు భాషకు ఆయన ఎనలేని సేవలు అందించారని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని