రవాణాశాఖలో ఓడీల పేరిట గుట్టుగా బదిలీలు

రవాణా శాఖలో కొంత కాలంగా పలువురు అధికారులు, ఉద్యోగులకు ఆన్‌ డ్యూటీ (ఓడీ) కింద గుట్టుగా బదిలీలు చేశారు. వివిధ కారణాలను సాకుగా చూపించి.. వాళ్లు కోరుకున్నచోట విధులు కేటాయిస్తూ ఆ శాఖ కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హా ఆదేశాలిస్తూ వచ్చారు.

Published : 15 Jun 2024 05:06 IST

ప్రభుత్వం మారడంతో రద్దు చేస్తూ ఆదేశాలు

ఈనాడు, అమరావతి: రవాణా శాఖలో కొంత కాలంగా పలువురు అధికారులు, ఉద్యోగులకు ఆన్‌ డ్యూటీ (ఓడీ) కింద గుట్టుగా బదిలీలు చేశారు. వివిధ కారణాలను సాకుగా చూపించి.. వాళ్లు కోరుకున్నచోట విధులు కేటాయిస్తూ ఆ శాఖ కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హా ఆదేశాలిస్తూ వచ్చారు. తాజాగా ప్రభుత్వం మారడంతో ఆ ఆదేశాలన్నీ రద్దుచేసి, వారిని పాత స్థానాల్లోకి వెళ్లి విధుల్లో చేరాలంటూ కమిషనర్‌ ఉత్తర్వులిచ్చారు. వీరిలో కొందరిని వైకాపా కడప ఎంపీ అవినాష్‌రెడ్డి సిఫార్సులతో గతంలో ఓడీ కింద బదిలీ చేశారనే ఆరోపణలున్నాయి. కొత్త ప్రభుత్వం రావడంతో ఓడీలన్నింటినీ రద్దుచేస్తూ శుక్రవారం ఆదేశాలు జారీచేశారు. వీరిలో ఆర్టీవోలు, ఎంవీఐల నుంచి కానిస్టేబుల్‌ వరకు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని