శాప్‌ ఏవోకి ఉద్యోగ విరమణ వర్తించదా?

సర్వీస్‌ నిబంధనల ప్రకారం గత నెల 31న ఉద్యోగ విరమణ చేయాల్సిన క్రీడా ప్రాధికార సంస్థ (శాప్‌) పరిపాలనాధికారి రామకృష్ణ ఇప్పటికీ అదే స్థానంలో కొనసాగడం చర్చనీయాంశమైంది.

Published : 15 Jun 2024 05:07 IST

ఈనాడు, అమరావతి: సర్వీస్‌ నిబంధనల ప్రకారం గత నెల 31న ఉద్యోగ విరమణ చేయాల్సిన క్రీడా ప్రాధికార సంస్థ (శాప్‌) పరిపాలనాధికారి రామకృష్ణ ఇప్పటికీ అదే స్థానంలో కొనసాగడం చర్చనీయాంశమైంది. ఆయన్ని కొనసాగించేందుకు పెట్టిన దస్త్రం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నందున.. ఉద్యోగ విరమణ చేయలేదని శాప్‌ అధికారులు చెప్పడం విశేషం. రామకృష్ణను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగించవద్దని ఒలింపిక్‌ అసోసియేషన్‌ కార్యదర్శి కేపీ రావు క్రీడలు, యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శికి రెండు రోజుల క్రితం లేఖ రాశారు. నిజానికి రామకృష్ణ సీనియర్‌ కోచ్‌. శాప్‌లో అధికారుల కొరత కారణంగా పరిపాలనాధికారిగా సేవలు అందిస్తున్నారు. ఆయన గత నెల 31న ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది. కొనసాగింపు ఉత్తర్వులొస్తాయి పదవీ విరమణ చేయొద్దని రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ అత్యున్నతాధికారి ఒకరు హామీ ఇవ్వడంతో రామకృష్ణ ఇప్పటికీ కొనసాగుతున్నట్లు తెలిసింది. దీంతో ఆయన వీడ్కోలు సభకు ఏర్పాట్లు చేసిన శాప్‌ ఉద్యోగులు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని