చట్టాల్లో మార్పులను.. నిరంతరం అధ్యయనం చేయాలి

చట్టాల్లో వచ్చే మార్పులను న్యాయవాదులు నిరంతరం అధ్యయనం చేయాలని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు సూచించారు.

Updated : 15 Jun 2024 06:28 IST

వృత్తిలో రాణించాలంటే చదవడం తప్ప వేరే మార్గం లేదు
న్యాయవాదుల శిక్షణ తరగతుల్లో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ దుర్గాప్రసాదరావు

జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు.
చిత్రంలో గంటా రామారావు, కృష్ణమోహన్, చిదంబరం, ద్వారకనాథరెడ్డి, సుబ్బారావు

ఈనాడు, అమరావతి: చట్టాల్లో వచ్చే మార్పులను న్యాయవాదులు నిరంతరం అధ్యయనం చేయాలని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు సూచించారు. న్యాయవాద వృత్తిలో రాణించాలంటే చదవడం తప్ప మరో మార్గం లేదన్నారు. వివిధ చట్టాలపై న్యాయవాదులు అవగాహన పెంపొందించుకునేందుకు కేఎల్‌ యూనివర్సిటీ సహకారంతో ఏపీ బార్‌కౌన్సిల్‌ శుక్రవారం నుంచి మూడు రోజులపాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. మొదటిరోజు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు.. ‘భారతీయ న్యాయ సంహిత’ (బీఎన్‌ఎస్‌)పై ప్రారంభోపన్యాసం చేశారు. 

సామాజిక సేవ శిక్షకు వీలుంది

‘కొత్త నేర న్యాయ చట్టాలు (భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్‌) జులై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఐపీసీలో 511 సెక్షన్లు ఉండగా.. దాని స్థానంలో తీసుకొస్తున్న బీఎన్‌ఎస్‌లో 358 సెక్షన్లు మాత్రమే ఉన్నాయి. ఐపీసీలో ఐదు రకాల శిక్షలు విధించడానికి వీలుంటే, వీటితోపాటు బీఎన్‌ఎస్‌లోని 202, 209, 226, 303(2), 355, 356 సెక్షన్ల ప్రకారం ‘కమ్యూనిటీ సర్వీసు’ (సామాజిక సేవ) కింద శిక్ష విధించేందుకు అవకాశం కల్పించారు’ అని జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు తెలిపారు. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఏవీ శేషసాయి, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ వీఆర్‌కే కృపాసాగర్, జస్టిస్‌ వి.శ్రీనివాస్, సెంటర్‌ ఫర్‌ సోషల్‌ సైకాలజీ అధ్యక్షుడు నూతలపాటి అరవింద్, కార్యక్రమ కో-ఆర్డినేటర్‌ గంటా రామారావు, బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ ఎన్‌.ద్వారకనాథరెడ్డి, వైస్‌ ఛైర్మన్‌ ఎస్‌.కృష్ణమోహన్, ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.చిదంబరం, కేఎల్‌ వర్సిటీ రిజిస్ట్రార్‌ కె.సుబ్బారావు, కేఎల్‌ న్యాయకళాశాల ప్రిన్సిపల్‌ పవన్‌కుమార్‌ వివిధ అంశాలపై ప్రసంగించారు. ఏపీ బార్‌ కౌన్సిల్‌ సభ్యులు, 600 మంది న్యాయవాదులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు