జాతీయ స్థాయిలో మెరిసిన తెలుగు తేజం

తెలుగుతేజం, ఐఏఎస్‌ అధికారి ఎం.వి.ఆర్‌.కృష్ణతేజకు జాతీయ పురస్కారం లభించింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన ఆయన కేరళ రాష్ట్రం త్రిసూర్‌ జిల్లా కలెక్టర్‌గా పని చేస్తున్నారు.

Updated : 15 Jun 2024 06:49 IST

జాతీయ బాలల రక్షణ కమిషన్‌ పురస్కారానికి ఐఏఎస్‌ అధికారి కృష్ణతేజ ఎంపిక

చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్‌టుడే: తెలుగుతేజం, ఐఏఎస్‌ అధికారి ఎం.వి.ఆర్‌.కృష్ణతేజకు జాతీయ పురస్కారం లభించింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన ఆయన కేరళ రాష్ట్రం త్రిసూర్‌ జిల్లా కలెక్టర్‌గా పని చేస్తున్నారు. బాలల హక్కుల రక్షణలో దేశంలోనే త్రిసూర్‌ జిల్లాను అగ్రగామిగా నిలపడంతో జాతీయ బాలల హక్కుల కమిషన్‌ పురస్కారానికి ఎంపికయ్యారు. 27న దిల్లీలో ఈ అవార్డును అందుకోనున్నారు. 2015 బ్యాచ్‌ ఐఏఎస్‌ అయిన కృష్ణతేజ 2023 మార్చిలో కేరళ రాష్ట్రం త్రిసూర్‌ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన 609 మంది విద్యార్థులను గుర్తించి దాతల సహకారంతో వారు ఉన్నత చదువులు చదివేలా చూశారు. అలాగే కరోనా సమయంలో భర్తలను పోగొట్టుకున్న 35 మంది వితంతువులకు ఇళ్లు నిర్మింపజేశారు. మరో 150 మంది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించారు. జిల్లాలో విద్యార్థులు మాదకద్రవ్యాల జోలికి వెళ్లకుండా పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఇలా ఎన్నో విధాలుగా బాలల రక్షణకు కృషి ఆయన్ను జాతీయ బాలల రక్షణ కమిషన్‌ పురస్కారం వరించింది. గతంలో కేరళ రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టించిన సమయంలో సబ్‌ కలెక్టర్‌గా ఉన్న కృష్ణతేజ చూపిన చొరవ జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చింది. అలాగే కేరళలో పర్యాటకాభివృద్ధికి కృషి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని