సీఎంఓలోకి రాజమౌళి, కార్తికేయ మిశ్రా

ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో)లోకి సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు ఎ.వి.రాజమౌళి, కార్తికేయ మిశ్రాలను తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎ.వి.రాజమౌళి 2003 బ్యాచ్‌ ఉత్తర్‌ప్రదేశ్‌ క్యాడర్‌ ఐఏఎస్‌ అధికారి.

Published : 15 Jun 2024 05:23 IST

ఈ ఇద్దరు అధికారులను ఏపీకి పంపాలని కేంద్రానికి రాష్ట్రం లేఖ

ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో)లోకి సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు ఎ.వి.రాజమౌళి, కార్తికేయ మిశ్రాలను తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎ.వి.రాజమౌళి 2003 బ్యాచ్‌ ఉత్తర్‌ప్రదేశ్‌ క్యాడర్‌ ఐఏఎస్‌ అధికారి. తెదేపా ప్రభుత్వంలో 2015-19 మధ్య ముఖ్యమంత్రి కార్యదర్శిగా సీఎంవోలో పనిచేశారు. ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్‌ హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇంటర్‌స్టేట్‌ క్యాడర్‌ డిప్యుటేషన్‌పై ఆయన్ను ఏపీకి పంపించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. కార్తికేయ మిశ్రా.. 2009 బ్యాచ్‌ ఏపీ క్యాడర్‌ ఐఏఎస్‌ అధికారి. ప్రస్తుతం డిప్యుటేషన్‌పై కేంద్ర ఆర్థిక సేవల శాఖలో డిప్యూటీ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన్ను రిలీవ్‌ చేసి ఏపీకి పంపించాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని