వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తితో దేశ రక్షణ: రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌

స్వయం ప్రతిపత్తితో కూడిన వ్యూహాత్మక ఆలోచనా విధానాలు అమలుచేయడం ద్వారా దేశ సమగ్ర రక్షణ సాధ్యమని, అందుకు కేంద్రప్రభుత్వం కట్టుబడి ఉందని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు.

Updated : 15 Jun 2024 06:48 IST

ఐఎన్‌ఎస్‌ జలాశ్వ నౌక సిబ్బందితో మాట్లాడుతున్న కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌

విశాఖపట్నం(సింధియా), న్యూస్‌టుడే: స్వయం ప్రతిపత్తితో కూడిన వ్యూహాత్మక ఆలోచనా విధానాలు అమలుచేయడం ద్వారా దేశ సమగ్ర రక్షణ సాధ్యమని, అందుకు కేంద్రప్రభుత్వం కట్టుబడి ఉందని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. రెండోసారి రక్షణమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన శుక్రవారం విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళం సందర్శనకు వచ్చారు. ఈస్ట్రన్‌ సీ బోర్డు యాక్ట్‌ పాలసీలో భాగంగా సముద్ర తీరంలోని ‘ఐఎన్‌ఎస్‌ జలాశ్వ’ నౌకపై నిర్వహించిన నౌకాదళం సంసిద్ధత సమీక్షలో పాల్గొని మాట్లాడారు. ఇండో- పసిఫిక్‌ తీర ప్రాంతంలో ఆర్థిక, రక్షణ దళాల శక్తి సామర్థ్యాల బలోపేతానికి ఇలాంటి సమీక్షలు దోహదపడతాయని స్పష్టం చేశారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో స్వేచ్ఛా సముద్రయానం, యాంటీ పైరసీ, శాంతి, సుస్థిరతకు అధిక ప్రాధాన్యం కల్పిస్తామని వెల్లడించారు. భవిష్యత్తులో సాగర భద్రతకు నౌకాదళం బలమైన ప్రభావం చూపేలా ఉండబోతోందన్నారు. తొలుత ఆయనకు భారత నౌకాదళం అడ్మిరల్‌ దినేష్‌ కె.త్రిపాఠి ఐఎన్‌ఎస్‌ జలాశ్వ నౌకపై సాదరస్వాగతం పలికారు. అనంతరం కేంద్రమంత్రి ఈస్ట్రన్‌ నేవల్‌ కమాండ్‌ ఫ్లాగ్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ ఇన్‌ చీఫ్‌ వైస్‌అడ్మిరల్‌ రాజేష్‌ పెంధార్కర్, జలాశ్వ నౌక అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. అంతకుముందు ప్రత్యేక విమానంలో దిల్లీ నుంచి విశాఖ చేరుకున్న మంత్రికి నేవల్‌ ఎయిర్‌స్టేషన్‌ ఐఎన్‌ఎస్‌ డేగాలో నేవీ సిబ్బంది గౌరవ వందనం అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని