జర్మనీలో మినీ మహానాడు

అయిదేళ్ల జగన్‌ అరాచక పాలనతో విసిగిపోయిన ఆంధ్రులు.. వైకాపా ప్రభుత్వానికి చరమగీతం పాడారని జర్మనీలోని తెలుగువారు పేర్కొన్నారు. తెదేపా ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో మినీ మహానాడును ఘనంగా నిర్వహించారు.

Published : 15 Jun 2024 05:28 IST

వేడుకల్లో పాల్గొన్న మహిళలు, యువత, చిన్నారులు

ఈనాడు డిజిటల్, అమరావతి: అయిదేళ్ల జగన్‌ అరాచక పాలనతో విసిగిపోయిన ఆంధ్రులు.. వైకాపా ప్రభుత్వానికి చరమగీతం పాడారని జర్మనీలోని తెలుగువారు పేర్కొన్నారు. తెదేపా ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో మినీ మహానాడును ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలో ఎన్డీయే ఘన విజయం సాధించి, ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో వేడుకలు నిర్వహించారు. కేకు కోసి శుభాకాంక్షలు తెలిపారు. చాలా మంది ఎన్నారైలు తమ ఉద్యోగాలకు సెలవు పెట్టి, ఏపీకి వచ్చి ఎన్డీయే అభ్యర్థుల గెలుపు కోసం క్షేత్రస్థాయిలో పనిచేశారని గుర్తుచేసుకున్నారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీయే అసాధారణ విజయం సాధించిందని కొనియాడారు. జగన్‌లా ప్రతీకారం తీర్చుకొనే మనస్తత్వం చంద్రబాబుది కాదని తెదేపా నేత కావలి గ్రీష్మ తెలిపారు. తెదేపా ఎన్నారై విభాగం కోర్‌ కమిటీ సభ్యుడు కుర్ర పవన్, బి.శివ, ఎస్‌.సుమంత్, దాసరి వంశీ, మహిళలు, యువత, చిన్నారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని