కిషన్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్‌కల్యాణ్‌

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రధాని మోదీ నిర్దేశించుకున్న లక్ష్యాలను అందుకునేందుకు బొగ్గు, గనులశాఖ ఎంతో కీలకం.

Published : 16 Jun 2024 04:40 IST

ఈనాడు డిజిటల్, అమరావతి: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రధాని మోదీ నిర్దేశించుకున్న లక్ష్యాలను అందుకునేందుకు బొగ్గు, గనులశాఖ ఎంతో కీలకం. ఆ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించగలరని విశ్వసిస్తున్నాను. ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు అందించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా’ అని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

ఐఏఎస్‌ కృష్ణతేజ సేవలు అభినందనీయం

జాతీయ బాలల హక్కుల కమిషన్‌ పురస్కారానికి ఎంపికైన తెలుగు ఐఏఎస్‌ అధికారి కృష్ణతేజకు ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ అభినందనలు తెలిపారు. కేరళలోని త్రిసూర్‌ జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తూ.. బాలల హక్కుల పరిరక్షణలో ఉత్తమ విధానాలు అనుసరించారని శనివారం ఓ ప్రకటనలో కొనియాడారు. కరోనా, కేరళ వరదల సమయంలో ఆయన అందించిన సేవలను ప్రజలు మరచిపోలేదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని