ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దుపై సీఎంకు కృతజ్ఞతలు

ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దుపై సంతకం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు విశ్రాంత ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ పీవీ రమేశ్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Published : 17 Jun 2024 04:58 IST

విశ్రాంత ఐఏఎస్‌ అధికారి పీవీ రమేశ్‌ 

ఈనాడు, అమరావతి: ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దుపై సంతకం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు విశ్రాంత ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ పీవీ రమేశ్‌ కృతజ్ఞతలు తెలిపారు. 200 ఏళ్లుగా భూపరిపాలన కోసం ఏర్పాటు చేసిన పటిష్ఠమైన వ్యవస్థలను సమర్థంగా అమలు చేయాలని ఆయన ఆదివారం ‘ఎక్స్‌’ వేదికగా చంద్రబాబును కోరారు. 1820లోనే రైత్వారీ సెటిల్‌మెంట్‌ ఏపీలో ప్రారంభమైందని పేర్కొన్నారు. భూమికి సురక్షితమైన హక్కు కల్పించేందుకు నీతి ఆయోగ్‌ ఇచ్చిన సలహా శాశ్వత హక్కు కల్పించని ప్రాంతాల కోసమేనని వివరించారు. 200 ఏళ్ల కిందటే రైత్వారీ సెటిల్‌మెంట్‌ జరిగిన మద్రాసు ప్రెసిడెన్సీ (ఆంధ్రప్రదేశ్‌ అందులో భాగమే) కోసం కాదన్నారు. ఈ సందర్భంగా ‘ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ ప్రత్యక్ష బాధితుడిని నేనే’ అంటూ గతంలో చేసిన పోస్ట్‌ను ట్యాగ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని