బెదిరించి రాజీనామాలు చేయించారు.. వైకాపా నేతలపై మాజీ వాలంటీర్ల ఫిర్యాదు

‘అకస్మాత్తుగా సమావేశమన్నారు. వెళ్లేసరికి రాజీనామాలు చేయాలని ఒత్తిడి తెచ్చారు. తర్వాత వచ్చేది మన ప్రభుత్వమే.. రాజీనామా చేయకపోతే అంతు చూస్తామని బెదిరించారు.

Published : 17 Jun 2024 06:27 IST

పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న మాజీ వాలంటీర్లు 

నెల్లూరు (నేర విభాగం), న్యూస్‌టుడే: ‘అకస్మాత్తుగా సమావేశమన్నారు. వెళ్లేసరికి రాజీనామాలు చేయాలని ఒత్తిడి తెచ్చారు. తర్వాత వచ్చేది మన ప్రభుత్వమే.. రాజీనామా చేయకపోతే అంతు చూస్తామని బెదిరించారు. వాళ్ల ముందే రాజీనామా చేయాలని ఆదేశించారు’ నెల్లూరులో పోలీసులకు ఫిర్యాదు చేసిన మాజీ వాలంటీర్ల ఆవేదన ఇది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైకాపా నేతలు బెదిరింపు రాజకీయాలు చేశారు. వాలంటీర్లతో ఎన్నికలకు ముందు బలవంతంగా రాజీనామాలు చేయించి ఎన్నికల్లో ఉపయోగించుకున్నారు. వచ్చేది వైకాపా ప్రభుత్వమేనని ఆదుకుంటామని హామీలు ఇచ్చారు. తీరా ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో రాజీనామా చేసిన వారిని ఏ నాయకుడూ పట్టించుకోవడం లేదు. దీంతో తమను మోసం చేసి రోడ్డున పడేశారంటూ వాలంటీర్లు పోలీసు స్టేషన్లను ఆశ్రయిస్తున్నారు. శనివారం నెల్లూరు 41వ డివిజన్‌ వైకాపా కార్పొరేటరు, నాయకులపై చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఆదివారం 21వ డివిజన్‌ కార్పొరేటరు మొయిళ్ల గౌరి, వైకాపా నాయకుడు సురేష్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని