ప్రవీణ్‌ప్రకాష్‌ను బదిలీ చేయాలి

విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాష్‌ను బదిలీ చేయాలని నోబుల్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. మంగళగిరిలోని ఎన్టీఆర్‌ భవన్‌లో అసోసియేషన్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు.

Published : 17 Jun 2024 05:07 IST

నోబుల్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ 

ఈనాడు డిజిటల్, అమరావతి: విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాష్‌ను బదిలీ చేయాలని నోబుల్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. మంగళగిరిలోని ఎన్టీఆర్‌ భవన్‌లో అసోసియేషన్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. సహాధ్యక్షురాలు పద్మావతి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్సీ అశోక్‌బాబు, మాజీ ఎమ్మెల్సీ ఏఎస్‌ రామకృష్ణ తదితరులు మాట్లాడారు. ‘పాఠశాలల విలీనానికి సంబంధించిన జీవో 117, పురపాలక పాఠశాలలకు సంబంధించిన జీవో 84 రద్దు చేయాలి. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు చేపట్టాలి’ అని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తెదేపా ప్రభుత్వం కట్టుబడి ఉందని వక్తలు తెలిపారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఆర్థిక కార్యదర్శులుగా నడిపినేటి వెంకట్రావు, హైమరావు, జె.శ్రీనివాసరావులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని