క్రీడాశాఖలో అవినీతిని బయటికి తీస్తాం: మంత్రి రాంప్రసాదరెడ్డి

‘రాష్ట్రవ్యాప్తంగా గత ఐదేళ్లలో క్రీడాశాఖలో జరిగిన అవినీతిపై విచారణ చేపడతాం. అవినీతిపరులను శిక్షిస్తాం. ప్రభుత్వం సొమ్మును తిరిగి రాబడుతాం’ అని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖా మంత్రి మండిపల్లి రాంప్రసాదరెడ్డి తెలిపారు.

Published : 17 Jun 2024 05:08 IST

కడపలో రాంప్రసాదరెడ్డిని సన్మానిస్తున్న కార్యకర్తలు

కడప, చిన్నచౌకు, న్యూస్‌టుడే: ‘రాష్ట్రవ్యాప్తంగా గత ఐదేళ్లలో క్రీడాశాఖలో జరిగిన అవినీతిపై విచారణ చేపడతాం. అవినీతిపరులను శిక్షిస్తాం. ప్రభుత్వం సొమ్మును తిరిగి రాబడుతాం’ అని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖా మంత్రి మండిపల్లి రాంప్రసాదరెడ్డి తెలిపారు. కడపలో ఆదివారం ఎమ్మెల్యే మాధవిరెడ్డి, వైఎస్సార్‌ జిల్లా తెదేపా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డితో మంత్రి భేటీ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజల సొమ్ము తిన్న అధికారులు, శాసనసభ్యులు, నాయకులందరినీ ఊచలు లెక్కపెట్టిస్తామన్నారు. 

పెద్దిరెడ్డి కుటుంబం అవినీతిని వెలికితీస్తాం 

రాయచోటి, న్యూస్‌టుడే: గత వైకాపా ప్రభుత్వ పాలనలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం రాయలసీమలో అభివృద్ధి లేకుండా చేసి.. ప్రజల ఆస్తులను లాక్కుందని మంత్రి మండిపల్లి రాంప్రసాదరెడ్డి ధ్వజమెత్తారు. ఇసుక, మద్యం, ఎర్రచందనం అక్రమ రవాణాతోపాటు నీటిపారుదల, రహదారుల పనుల్నీ వదల్లేదని పేర్కొన్నారు. వచ్చే ఆరు నెలల్లో పెద్దిరెడ్డి కుటుంబం అవినీతిని బయటపెడతామని స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఆదివారం ఆయన రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. రహదారులపై ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు. అన్నమయ్య జిల్లా ముదివీడు ప్రాజెక్టులో జరిగిన అవినీతిని వెలికితీసి, రైతులకు న్యాయం చేస్తామని ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని