వెన్నెముక శస్త్రచికిత్స వైద్యునికి అంతర్జాతీయ అవార్డు

వెన్నులోని డిస్కులకు పోషక పదార్థాలు ఎలా అందుతున్నాయో ప్రయోగాత్మకంగా నిరూపించిన పరిశోధనకు గుంటూరు మల్లిక స్పైన్‌ సెంటర్‌ డైరెక్టర్, ప్రముఖ వెన్నెముక శస్త్రచికిత్స నిపుణుడు నరేష్‌బాబుకు ప్రతిష్ఠాత్మక ‘ఐఎస్‌ఎస్‌ఎల్‌ఎస్‌ ప్రైజ్‌’ అవార్డు దక్కింది.

Published : 17 Jun 2024 05:09 IST

అవార్డుతో నరేష్‌బాబు, చిత్రంలో కజుహిరో చిబ, హెలీనా బ్రిస్‌బై

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: వెన్నులోని డిస్కులకు పోషక పదార్థాలు ఎలా అందుతున్నాయో ప్రయోగాత్మకంగా నిరూపించిన పరిశోధనకు గుంటూరు మల్లిక స్పైన్‌ సెంటర్‌ డైరెక్టర్, ప్రముఖ వెన్నెముక శస్త్రచికిత్స నిపుణుడు నరేష్‌బాబుకు ప్రతిష్ఠాత్మక ‘ఐఎస్‌ఎస్‌ఎల్‌ఎస్‌ ప్రైజ్‌’ అవార్డు దక్కింది. అంతర్జాతీయ లంబార్‌ స్పైన్‌ అధ్యయన సంస్థ గత నెల 30న ఇటలీలోని మిలాన్‌లో నిర్వహించిన సదస్సులో అవార్డుతో పాటు 20 వేల డాలర్ల నగదు పురస్కారంతో ఆయన్ను సత్కరించింది. గత 50 ఏళ్లలో ఈ అవార్డు దక్కిన రెండో భారతీయ వైద్యుడిగా ఆయన గుర్తింపు పొందారు. గుంటూరులో ఆదివారం నరేష్‌బాబు ఈ వివరాలు వెల్లడించారు. లంబార్‌ స్పైన్‌ అధ్యయన సంస్థ అధ్యక్షుడు కజుహిరో చిబ, ప్రైజ్‌ కమిటీ అధ్యక్షురాలు హెలీనా బ్రిస్‌బై చేతుల మీదుగా అవార్డు అందుకున్నానని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని