రైలు ప్రమాద క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి : పవన్‌కల్యాణ్‌

పశ్చిమబెంగాల్‌లో చోటుచేసుకున్న రైలు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ విచారం వ్యక్తం చేశారు.

Updated : 18 Jun 2024 05:27 IST

ఈనాడు డిజిటల్, అమరావతి: పశ్చిమబెంగాల్‌లో చోటుచేసుకున్న రైలు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో పలువురు మృతి చెందడం దురదృష్టకరమని సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని రైల్వే మంత్రిత్వశాఖను కోరుతున్నాను. ప్రమాదాల నివారణకు ఉద్దేశించిన కవచ్‌ సాంకేతికతను సమర్థంగా వినియోగించుకోవాలి. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’ అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని