వైకాపా సోషల్‌ మీడియాలో ఉద్యోగం.. నైపుణ్యాభివృద్ధి సంస్థ నుంచి జీతాలు

ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ)లో వైకాపా ప్రభుత్వం సాగించిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.

Updated : 18 Jun 2024 15:28 IST

ఈనాడు, అమరావతి: ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ)లో వైకాపా ప్రభుత్వం సాగించిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ప్రభుత్వం మారడంతో సంస్థలో జరిగిన అవినీతిపై ఉద్యోగులు నోరు విప్పుతున్నారు. ఏపీఎస్‌ఎస్‌డీసీలో పని చేయకపోయినా 76 మంది ఉద్యోగులకు ఐదేళ్లపాటు జీతాలు చెల్లించిన వైనం తాజాగా బయటపడింది. వీరితో వైకాపా సోషల్‌ మీడియాలో పని చేయించుకుంటూ ఏపీఎస్‌ఎస్‌డీసీ నుంచి ప్రజాధనాన్ని జీతాల రూపంలో చెల్లించారు. ఇదే కాకుండా జగన్‌ దగ్గర పని చేసే నాగేశ్వరరెడ్డి సిఫార్సుతో సంస్థలోకి ప్రవేశించిన భారతిరెడ్డి, ఆమె భర్త.. శిక్షణ కేంద్రాల ద్వారా వచ్చిన డబ్బులను దోచేసినట్లు ఆరోపణలున్నాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఈడీగా డిప్యుటేషన్‌పై వచ్చిన రామకోటిరెడ్డి.. స్కిల్‌ హబ్స్, కళాశాలలకు సామగ్రి కొనుగోళ్లు, శిక్షణ నిధులను భారీగా దోచేసినట్లు తెలుస్తోంది. నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖకు సలహాదారుగా వ్యవహరించిన చల్లా మధుసూదన్‌రెడ్డి సైతం నైపుణ్యాభివృద్ధి సంస్థలోనే తిష్ఠ వేసి, ప్రాజెక్టుల పేరుతో నిధులను హాంఫట్‌ చేశారు. జర్మనీ సంస్థకు చెందిన ప్రాజెక్టును కొనసాగించేందుకు, బిల్లులు చెల్లించేందుకు రూ.30 లక్షల వరకు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని