నేనూ ఓ కార్మికుడిగా పనిచేస్తా

ఎన్డీయే ప్రభుత్వంలో తానూ ఓ కార్మికుడిగా పని చేస్తానని ఆ శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ తెలిపారు.

Published : 18 Jun 2024 05:30 IST

మంత్రి వాసంశెట్టి సుభాష్‌

రామచంద్రపురం, న్యూస్‌టుడే: ఎన్డీయే ప్రభుత్వంలో తానూ ఓ కార్మికుడిగా పని చేస్తానని ఆ శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ తెలిపారు. సోమవారం తన జన్మదినం సందర్భంగా డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రపురం పాతబస్టాండ్‌ సెంటర్లో 80 మంది ఆటో కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘సుమారు పదేళ్లపాటు నేను వైకాపాలో పని చేసినా సరైన గుర్తింపు లభించలేదు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ నన్ను గుర్తించి వంద రోజుల వ్యవధిలోనే ఎమ్మెల్యేగా చేయడమే కాకుండా మంత్రిగా జనం మధ్య ఉండే శాఖను అప్పగించారు. వైకాపా హయాంలో రహదారులకు మరమ్మతులు చేయకపోవడంతో ఆటో కార్మికులు తీవ్రంగా నష్టపోయారు. చంద్రబాబు పాలనలో వాటిని బాగు చేస్తాం’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని