ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు

ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, బ్యాగ్‌లు అందించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాల విద్యార్థులకు సరఫరా చేస్తున్న విధానంలోనే వీరికీ అందించాలని మంగళవారం వెలువరించిన ఆదేశాల్లో పేర్కొంది.

Published : 19 Jun 2024 03:49 IST

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, బ్యాగ్‌లు అందించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాల విద్యార్థులకు సరఫరా చేస్తున్న విధానంలోనే వీరికీ అందించాలని మంగళవారం వెలువరించిన ఆదేశాల్లో పేర్కొంది. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు, ఏపీ ఆదర్శ పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషన్‌ సంస్థలు, హైస్కూల్‌ ప్లస్‌ల్లో కలిపి మొత్తం 2,00,753 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి జులై 15లోపు ఒక్కో విద్యార్థికి 12 నోటు పుస్తకాలు బ్యాగ్, పాఠ్యపుస్తకాలు అందించాలని ప్రభుత్వం సూచించింది. గతంలో అమలు చేసిన ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీని వైకాపా ప్రభుత్వం నిలిపివేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని