వాసుదేవరెడ్డి బెయిలు పిటిషన్‌ విచారణ వాయిదా

ఏపీ స్టేట్‌ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌బీసీఎల్‌)కు సంబంధించిన కీలక దస్త్రాలు, కంప్యూటర్‌ పరికరాల చోరీ, ఆధారాల ధ్వంసం ఆరోపణలో సీఐడీ నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ మాజీ ఎండీ, ఐఆర్‌టీఎస్‌ అధికారి డి.వాసుదేవరెడ్డి దాఖలుచేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ఈనెల 20కి వాయిదా పడింది.

Published : 19 Jun 2024 03:50 IST

ఈనాడు, అమరావతి: ఏపీ స్టేట్‌ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌బీసీఎల్‌)కు సంబంధించిన కీలక దస్త్రాలు, కంప్యూటర్‌ పరికరాల చోరీ, ఆధారాల ధ్వంసం ఆరోపణలో సీఐడీ నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ మాజీ ఎండీ, ఐఆర్‌టీఎస్‌ అధికారి డి.వాసుదేవరెడ్డి దాఖలుచేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ఈనెల 20కి వాయిదా పడింది. మంగళవారం ఈ పిటిషన్‌ విచారణకు వచ్చినప్పుడు సీఐడీ తరఫున సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. విజయవాడలోని పిటిషనర్‌ ఇంటి తాళం పగలగొట్టి సోదాలు చేసేందుకు అనుమతి కోరుతూ దిగువ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ పెండింగ్‌లో ఉందని అన్నారు. పూర్తి వివరాలు సమర్పించేందుకు విచారణను వాయిదా వేయాలని కోరారు. అంగీకరించిన న్యాయమూర్తి జస్టిస్‌ టి. మల్లికార్జునరావు విచారణను గురువారానికి వాయిదా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని