21, 22 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు

అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 21, 22 తేదీల్లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక, సభ్యుల ప్రమాణ స్వీకారం నిర్వహిస్తారు.

Published : 19 Jun 2024 04:19 IST

ఈనాడు, అమరావతి: అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 21, 22 తేదీల్లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక, సభ్యుల ప్రమాణ స్వీకారం నిర్వహిస్తారు. సభాపతిగా అయ్యన్నపాత్రుడికి అవకాశం లభించనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే నిర్ణయించారు. ప్రొటెం స్పీకర్‌గా సభలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహరించే అవకాశం ఉందని సమాచారం. అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 24 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం తొలుత నిర్ణయించింది. తరువాత తేదీల్లో మార్పు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని