తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

శ్రీవారి సర్వదర్శనానికి ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేకుండా వచ్చిన భక్తుల రద్దీ మంగళవారం కూడా కొనసాగింది. వారం రోజులుగా రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. ఉచిత సర్వదర్శనం కోసం క్యూ లైన్‌లలో వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-2లోని కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి.

Updated : 19 Jun 2024 06:46 IST

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి సర్వదర్శనానికి ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేకుండా వచ్చిన భక్తుల రద్దీ మంగళవారం కూడా కొనసాగింది. వారం రోజులుగా రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. ఉచిత సర్వదర్శనం కోసం క్యూ లైన్‌లలో వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-2లోని కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. రింగ్‌రోడ్డులోని శిలాతోరణం వరకూ క్యూ లైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 24 గంటలకుపైగా పడుతోందని తితిదే ప్రకటించింది. క్యూలైన్‌లో భక్తులకు తితిదే తాగునీరు, పాలు, అన్నప్రసాదం పంపిణీ చేస్తోంది. రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లు కలిగిన భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-1లోని 7 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. వీరికి 3 గంటల్లో శ్రీవారి దర్శనం లభిస్తోంది. గదుల కోసం రద్దీ కొనసాగుతోంది.  


ముందస్తు కోటా మేరకే వృద్ధుల దర్శనం

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవారి దర్శనానికి వృద్ధుల విషయంలో సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని తితిదే పేర్కొంది. రోజూ వెయ్యి మంది వృద్ధులు, దివ్యాంగుల కోసం మూడు నెలల ముందుగానే ప్రతి నెలా 23న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌ కోటా విడుదల చేస్తోందన్నారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌ టికెట్లు ఆగస్టు వరకు బుక్‌ అయ్యాయని, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులను నమ్మవద్దని భక్తులకు విజ్ఞప్తి చేసింది. సరైన సమాచారం కోసం తితిదే అధికారిక వెబ్‌సైట్‌  www.tirumala.org, https://ttdevastanams.ap.in ను సంప్రదించవచ్చని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని