ఏపీ న్యాయసేవాధికార సంస్థ ఈసీగా జస్టిస్‌ దుర్గాప్రసాదరావు

ఏపీ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షుడు(ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌-ఈసీ)గా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులిచ్చింది.

Updated : 19 Jun 2024 06:45 IST

ఈనాడు, అమరావతి: ఏపీ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షుడు(ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌-ఈసీ)గా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులిచ్చింది. హైకోర్టు సీనియారిటీలో రెండో స్థానంలో ఉన్న న్యాయమూర్తిని ఈసీగా నామినేట్‌ చేయడం సంప్రదాయంగా వస్తోంది. హైకోర్టు సీజేను సంప్రదించాక ఈసీని గవర్నర్‌ నామినేట్‌ చేస్తారు. ఇప్పటివరకు ఈసీగా బాధ్యతలు నిర్వహించిన జస్టిస్‌ ఏవీ శేషసాయి పదవీ విరమణ చేసిన నేపథ్యంలో జస్టిస్‌ దుర్గాప్రసాదరావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని