వందేభారత్‌లో విజయవాడకు మంత్రి అనిత

రాష్ట్ర హోంశాఖ మంత్రిగా పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇందుకోసం మంగళవారం ఉదయం విశాఖపట్నం నుంచి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఆమె విజయవాడ వెళ్లారు.

Published : 19 Jun 2024 04:33 IST

వందేభారత్‌ రైలులో కుమార్తె రష్మితతో హోంమంత్రి అనిత 

పాయకరావుపేట, విజయవాడ(రైల్వేస్టేషన్‌)-న్యూస్‌టుడే: రాష్ట్ర హోంశాఖ మంత్రిగా పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇందుకోసం మంగళవారం ఉదయం విశాఖపట్నం నుంచి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఆమె విజయవాడ వెళ్లారు. రైలులో పలువురు ప్రయాణికులు అనితతో స్వీయచిత్రాలు తీసుకుని అభినందనలు తెలిపారు. అమరావతిలో బుధవారం 11.30 గంటలకు బాధ్యతలు తీసుకుంటానని ‘న్యూస్‌టుడే’కు ఆమె చెప్పారు. విజయవాడలో రైలు దిగిన ఆమెకు రైల్వే డీఎస్పీ నాగేశ్వరరావు తదితరులు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. అనంతరం అనిత కానూరులోని క్యాంపు కార్యాలయానికి వెళ్లారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని